A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ ప్యాకేజీ చాలదన్న రఘురామరాజన్
Share |
May 27 2020, 1:23 am

దేశంలో ఆర్దిక వ్యవస్థను పునరుద్దరించేందుకు మరిన్ని ప్యాకేజీలు అవసరం అవుతాయని ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ అబిప్రాయపడ్డారు. భారీ పారిశ్రామిక సంస్థలు, బ్యాంకులు, ఎంఎ్‌సఎంఈలు అన్నింటికీ ఏదో ఒక రకమైన ప్యాకేజీ అవసరమేనని ఆయన అన్నారు. కరోనా వల్ల ఏర్పడిన నష్టంతో పోల్చితే ఇటీవల ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఏ మాత్రం చాలదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.కష్టాల్లో ఉన్న రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోకపోతే, ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత భారీగా నష్టపోయే పోయే ప్రమాదం ఉందని రాజన్‌ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్‌, టూరిజం, కార్ల కంపెనీలు, నిర్మాణ రంగాలను ఆదుకునేందుకు అమెరికాలో వలె ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం భారత్‌లో సాధ్యం కాదని ఆయన చెప్పారు. బక్కచిక్కిన ఈ సంస్థలను ఆదుకునేందుకు రుణ పునర్‌ వ్యవస్థీకరణతో పాటు, మూల ధన సాయం కూడా అవసరం కావచ్చన్నారు. వలస కార్మికులకు ఉచిత ఆహార ధాన్యాలందిస్తే చాలదని, ఉచిత నగదు సాయం అందించాల్సిన అవసరం ఉన్నదని రాజన్‌ నొక్కి చెప్పారు. న

tags : raghuramarajan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info