A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇన్ని పరీక్షలు.. అమెరికాకు బాడ్జ్ ఆఫ్ హానర్
Share |
May 27 2020, 1:04 am

అమెరికా అద్యక్షుడు కింద పడ్డా తనదే పైచేయి అంటున్నారు. అమెరికాలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కరోనా వైరస్ విజృంభించిందని, ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. మరే దేశం చేయనన్ని కరోనా పరీక్షలు అమెరికా చేసిందని, ఇది అమెరికా కు గగౌరవం అని , దీనికోసం విశేష కృషి చేస్తున్న డాక్టర్ లు, సిబ్బందికి గౌరవం అని ఆయన అన్నారు.పదిహేను లక్షల కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయని అంటున్నారు..అంటే దానిని ఆ రకంగా చూడడం కాదు. అమెరికా దేశం మరే దేశం చేయనన్ని కరోనా పరీక్షలు చేయడం వల్ల అన్నిటిని గుర్తించగలిగాం అని గమనించాలని ఆయన అన్నారు. అమెరికాలో ఇంతవరకు కోటి ఇరవైఆరు లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, పదిహేను లక్షల మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. కాగా కరోనా వల్ల 90 వేల మంది ఇంతవరకు అమెరికాలో మరణించారు.

tags : trump

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info