A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రభుత్వం చెప్పినట్లే పంటలు వేయండి
Share |
May 26 2020, 1:57 pm

తెలంగాణ ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు పంటలు వేయాలని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం పంగిడి, చిమ్మపుడి గ్రామంలోని చెరువు పూడిక పనుల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలకు
కూరగాయలు, బత్తాయి కాయలు, మాస్కులు, ORS ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు ఎక్కడ కూడా మొక్కజొన్నలు వేయకూడదని, పత్తి,
కంది, మిర్చి వేయాలని సూచించారు. ముఖ్యంగా రఘునాధపాలెం మండలంలో వేసేదే పత్తి, మిర్చి అని అన్నారు.
ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులు పంటలు వేయడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ప్రభుత్వం కందికి పూర్తి
మద్దతు ఇచ్చి పంటలను కొనుగోలు చేస్తుందని అన్నారు. యాసంగిలోనే మొక్కజొన్న సాగు, వానాకాలం కంది, పత్తి
పంటలు ఎక్కువ సాగుచేయాలని కోరారు. మొక్కజొన్న జోలికి పోవొద్దన్నారు. పంటల సాగుపై ఈ నెల 21న ముఖ్యమంత్రి
కేసీఆర్ గారి సమావేశం నిర్వహించనున్నారు. ఏ ఏ జిల్లాలలో ఏఏ రకాలు పంటలు సాగు చేయాలనే అంశంపై ప్రభుత్వం
పంటల మ్యాప్ సిద్దం చేసి రైతులకు అందించనున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవసాయంపై ఇంత దృష్టి
పెట్టలేదని, పంట వేయడం దగ్గర నుండి పంటలు అమ్ముకునే వరకు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు.
3లక్షల టన్నుల వరి కొనుగోలు చేశాం. ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి రైతు రావాలన్నది ప్రభుత్వ
ద్యేయమన్నారు. నేడు దేశానికి మొత్తం అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నామని, తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా
నిలిచిందన్నారు. తెలంగాణ ఫలాలు దేశానికి అందించాలని, తెలంగాణ రైతు ఉన్నతస్థాయిలో ఉండాలని కేసీఆర్ గారి
ఆశయం. వానాకాలంలో 1.35 కోట్ల ఎకరాలలో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆరేళ్లలో కరంటు,
సాగునీటి అవస్థలు తొలగించుకున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రాధాన్యతతో కూడిన రంగం వ్యవసాయం అని
అందుకే ఒక సమగ్ర వ్యవసాయ విధానం ఉండాలని పట్టుబట్టి కార్యాచరణ మొదలుపెట్టారని అన్నారు. మనకు కనీస
మద్దతుధర కాదు రైతులకు గిట్టుబాటు ధర కావాలని దృక్పధంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
కరోనా కట్టడిలో చురుకైన పాత్ర పోషించి, ఉపాధిహామీ పనిలో అత్యధిక మందికి పనులు కల్పించడంలో చురుకైన పాత్ర
పోషించి రాష్ట్రంలో 13వ స్థానంలో నుండి 3వ స్థానంకు తీసుకురావడం పట్ల జిల్లా కలెక్టర్ RV కర్ణన్ గారిని అభినందించారు.
అటు బుగ్గవాగు ప్రాజెక్ట్, ఇటు సీతారామ ప్రాజెక్ట్ పనులు వడి వడిగా సాగుతున్నాయి. ప్రతి ఎకరానికి గోదావరి జలాలు
అందించి రెండు పంటలు వేసే విధింగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఏకరాన్ని గోదావరి జలాలు త్వరలో
పలకరిస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS గారు, అదనపు కలెక్టర్ స్నేహాలత మోగిలి గారు,DRDA PD గారు,  AMC చైర్మన్
వెంకటరమణ గారు, MDO శ్రీదేవి గారు, తహసీల్దార్ నర్సింహారావు గారు, ఎంపీపీ మలోత్ గౌరీ గారు, జడ్పీటీసీ ప్రియాంక
తదితరులు ఉన్నారు.

tags : puvvada

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info