A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త వ్యవసాయ విదానం ఈ ఏడాది వద్దు
Share |
May 27 2020, 12:59 am

తెలంగాణలో కొత్త వ్యవసాయ విదానం ఈ ఏడాదికి వాయిదా వేసుకోవాలని పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి కోరారు. రైతులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాత వచ్చే ఏడాది నుంచి కొత్త పాలసీ రూపొందించాలని ఆయన సూచించారు. నాలుగైదు రోజుల్లో విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన పంట వేయాలనడం తుగ్లకు చర్య అని ఆయన అన్నారు.
రైతులపై ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు. చెప్పిన పంట వేయకపోతే రైతుబంధు ఇవ్వమనడం రైతులను అవమానించడమే అవుతుందన్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే తాము పోరాటం చేస్తామని అన్నారు. దరిద్రపు టీఆర్‌ఎస్‌ పాలనలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాణీ ఎందుకు చేయలేదని, రైతు బంధు 40శాతం రైతులకు ఇంకా ఎందుకు అందలేదని ప్రశ్నించారు.

tags : uttamkumar reddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info