A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వచ్చే ఆగస్టు నాటికి 50వేల ఇళ్లు-మంత్రి
Share |
May 27 2020, 1:06 am

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 50 వేల ఇళ్లను లబ్ధిదారులకు వచ్చే ఆగస్టు నాటికి అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. దసరా నాటికి లక్ష ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి అందిస్తామన్నారు.లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఇళ్ల నిర్మాణాలు ఆగలేదని, శరవేగంగా రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఇంత వరకు సుమారు 10 వేల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని శ్రీనివాసయాదవ్ తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై బుధవారం మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, మహమూద్‌ అలీ, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రభుత్వ అధికారులు హజరయ్యారు.

tags : talasani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info