A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో 3.8 కోట్ల మంది నిరుద్యోగులు..
Share |
May 27 2020, 1:41 am

కరోనా దెబ్బ అమెరికాపై చాలా తీవ్రంగా పడినట్లే ఉంది.అక్కడ అనూహ్యమైన రీతిలో నిరుద్యోగం ప్రబలుతోంది.కరోనా సమస్య మొదలైన తర్వాత వరసగా తొమ్మిదో వారం కూడా లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత వారంలో 24 లక్షలమంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి మధ్యలో నుంచి ఇప్పటి వరకు మొత్తం 3.86 కోట్ల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.
అమెరికాలో ఉద్యోగుల తప్పు లేకుండా వారిని ఉద్యోగం నుంచి తీసేస్తే, ప్రభుత్వం వారికి ప్రతి వారం నిరుద్యోగ భృతి చెల్లిస్తుంది. నిరుద్యోగ భృతికి ఎవరు అర్హులనేది వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితుల కారణంగా ట్రంప్ ప్రభుత్వం ఉద్యోగం పోయిన వాళ్లే కాకుండా.. సొంత వ్యాపారం చేసుకునే వారిని, ఫ్రీ లాన్సర్లను కూడా నిరుద్యోగ భృతికి అర్హులుగా ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది. దీంతో ఉద్యోగం పోయిన వారు, ఉద్యోగం లేని వారు ఇలా అనేక మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకుంటున్నారు.

tags : america,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info