A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విమాన ప్రయాణాలకు ఏడు జోన్ లు
Share |
May 27 2020, 1:46 am

దేశంలో విమానాల ప్రయాణాలను ఏడు జోన్ లుగా విభజించి టిక్కెట్ ధరలు నిర్ణయిస్తున్టన్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీవ్ సింగ్ చెప్పారు. 0-40 నిమిషాలు ఒకటో కేటగిరి, 40-60 రెండో కేటగిరి, 60-90 మూడో కేటగిరి, 90-120 నిమిషాలు నాలుగో కేటగిరి, 12-150 నిమిషాలు ఐదో కేటగిరీ, 150-180 నిమిషాలు ఆరో కేటగిరీ, 180-210 నిమిషాల ప్రయాణాన్ని ఏడో కేటగిరీగా విభజించామని ఆయన వివరించారు. దిల్లీ- ముంబయి మధ్య విమాన ప్రయాణానికి కనిష్ఠ ధర రూ.3,500. గరిష్ఠ ధర రూ.10వేలు. రాబోయే మూడు నెలల పాటు ఈ ఛార్జీలు వర్తిస్తాయని ఆయన వివరించారు. విమానంలోని కనీసం 40 శాతం సీట్లు కనిష్ఠ, గరిష్ఠ మధ్య సగటు ధరకు విక్రయించాలి. అంటే దిల్లీ-ముంబయి రూట్లో రూ.6,700 కంటే తక్కువకు 40 శాతం టికెట్లు అమ్మాలి.విమానంలో భౌతిక దూరం సాధ్యపడదని,కాబట్టి సీట్లు విడిచి పెట్టడం లేదని ఆయన తెలిపారు.

tags : air india

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info