A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
Share |
May 27 2020, 3:01 am

ఎపి ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త వచ్చింది. గత రెండు నెలలుగా ఏభై శాతం జీతాలు మాత్రమే తీసుకోవలసి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల నుంచి పూర్తి జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ రకంగా పూర్తి జీతాలు ఇచ్చే రాష్ట్రంగా ఎపి మారిపోయింది. ఆర్దికంగా ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మే నెల నుంచి పూర్తి జీతాలు ఇవ్వడం ఆసక్తికరమైన అంశమే. జీతాలను వాయిదా వేయడంపై ఎపి హైకోర్టు విచారణ చేస్తున్న నేపద్యంలో ఈ నెల ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం చేయడం ద్వారా మంచి సమాదానం ఇచ్చినట్లయింది.

tags : ap, good news

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info