A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసి దివాకరరెడ్డి ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా
Share |
May 27 2020, 1:50 am

అనంతపురం టిడిపి మాజీ ఎమ్.పి జెసి దివాకరరెడ్డి ఈసారి ముఖ్యమంత్రి జగన్ ను మెచ్చుకోవడమే కాదు..టిడిపి దీక్షలను కూడా తప్పు పట్టారు. కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వడానికి జగన్ చిత్తశుద్దితో పనిచేస్తున్నారని ఆయన అన్నారని వార్త వచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో తెచ్చిన సీఎం జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. పోతిరెడ్డిపాడు కోసం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చాలా కృషి చేశారని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. టీడీపీ నేతలు చేసే దీక్షలు వృధా అని తెలిపారు. ఎందుకు దీక్షలు చేస్తున్నారో టీడీపీ నేతలకే తెలియదని దివాకరరెడ్డి అన్నారు.

దివాకరరెడ్డి ఈ వ్యాఖ్యలకే కట్టుబడి ఉంటారా!మచిదే.

tags : jc

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info