A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప.బెంగాల్ లో తుపాను-కరోనా కన్నా తీవ్రం
Share |
May 27 2020, 3:04 am

పశ్చిమబెంగాల్ లో ఉంపన్‌ తుపాన్‌ ప్రభావం కరోనా వైరస్‌ కంటే తీవ్రంగా ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు.తుపాన్‌ భారీ వర్షం, తీవ్రమైన గాలితో విలయతాండవం సృష్టించిందని ఆమె చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి తీవ్ర తుపాన్‌ సంభవించిందని ఆమె అన్నారు. తుపాన్‌ వల్ల సముద్ర తీర ప్రాంత ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలు ఇళ్లు కూలిపోయి, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్థంబాలు పడిపోవటంతో కరెంట్‌ నిలిచిపోయింది. అనేక లోతట్టు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. తుపాన్‌ వల్ల 125 కిలో మీటర్ల వేగంతో గాలి వీచటంతో ప్రజలు భయభ్రాతులకు గురయ్యారు. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో తుపాన్‌ ప్రభావంతో మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా మూసివేసిన కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో వర్షపు వరద నీరు చేరింది.

tags : mamata benarji

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info