A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేనకు సంబందం లేదు-నాగబాబు
Share |
May 27 2020, 3:07 am

అవకాశం ఉందని ఏదో ఒకటి మాట్లాడితే ఇలాంటి తలనొప్పులే వస్తాయి.గాందీజీ ని హత్య చేసిన నాధూరామ్ గాడ్స్ కి అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రముఖ నటుడు నాగబాబు ఇబ్బందుల్లో పడినట్లుగా ఉంది. గాడ్సే దేశ భక్తిని శంకించలేమని నాగబాబు వ్యాఖ్యానించడం పెద్ద వివాదం అయింది.కొందరు ఆయనపై పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. ఈ నేపద్యంలో నాగబాబు ఒక వివరణ ఇచ్చారు.

‘నేను ఏ అంశంపై ట్వీట్ చేసినా.. అది నా వ్యక్తిగత బాధ్యతే. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబ సభ్యులకుగానీ నా అభిప్రాయాలలో ఎటువంటి ప్రమేయం లేదు’ అని పేర్కొన్నారు. తాను గాడ్సేని సమర్దించలేదని, ఆయన గత చరిత్ర తెలుసుకోవాలని అన్నానని నాగబాబు అంతకుముందు వ్యాఖ్యానించినా అది సంతృప్తి కలిగించలేదు. దీంతో ఈ తాజా వివరణ ఇచ్చినట్లుగా ఉంది.

tags : nagababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info