A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వడగాడ్పులు వస్తున్నాయి..జాగ్రత్త
Share |
May 27 2020, 1:54 am

ఎపిలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాడ్పుల అవకాశం ఉందని కూడా తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ తీవ్రంగా ఉంటాయి. ఈ ఏడాది వడగాడ్పుల హెచ్చరికను మొదటిసారి ఇచ్చారు. కోస్తాలోని పలు ప్రాంతాలలో అత్యధిక ఉష్ణగ్రతలు నమోదు అయ్యాయి.గుంటూరు జిల్లా రెంటచింతల వద్ద 47.2డిగ్రీల వేడి నమోదు కాగా,
విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.ఈనెల 25వ తేదీ ఉదయం రోహిణి కార్తె ప్రవేశించనుంది. దీనికి ముందస్తు సంకేతంగా ఈనెల 22 నుంచి ఎండలు భగ్గుమనడంతోపాటు వడగాడ్పులు కూడా వీస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. అక్కడక్కడా వడగాడ్పులు కూడా వీచే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ పేర్కొంది.రోహిణి కార్తె సమయంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి కనుక నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

tags : ap, heat wave

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info