A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో సెలూన్ లు ఈ నిబందనలు పాటించాలి
Share |
May 27 2020, 12:47 am

ఎపిలో సెలూన్ లు తెరవడానికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చింది.ఎక్కువ బడ్జెట్, తక్కువ బడ్జెట్ సెలూన్లకు వేర్వేరు మార్గదర్శకాలు ఇచ్చారు. అవి ఇలా ఉన్నాయి.

ఎక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు
► సెలూన్లలో పనిచేసే సిబ్బంది, వినియోగదారులకు తప్పనిసరిగా టచ్‌లెస్‌ థర్మోమీటర్లతో టెంపరేచర్‌ పరీక్షించాలి. 99 డిగ్రీల ఫారన్‌హీట్‌ కంటే ఎక్కువ ఉన్న వారిని వెంటనే ఇళ్లకు పంపించేయాలి.
► ప్రతి కస్టమర్‌ పేరు, ఫోన్‌ నంబరుతోపాటు ఏమైనా అనారోగ్య లక్షణాలు ఉంటే నమోదు చేయాలి.
► ముందు అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఈ సెలూన్లను నిర్వహించాలి. తద్వారా సెలూన్‌లోగానీ బయటగానీ ఎక్కువ మంది నిరీక్షించకుండా నివారించవచ్చును.
► సెలూన్‌ లోపల కస్టమర్ల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలి.
► సిబ్బంది ఎల్లప్పుడూ మాస్కులు ధరించాలి. డిస్పోజబుల్‌ గ్లౌజులు ధరించాలి. కస్టమర్‌ మారే ప్రతి సారి గ్లౌజులు మార్చాలి. వీలైతే కళ్లద్దాలు, ఫేస్‌ షీల్డు ధరించాలి.
► సెలూన్‌కు వచ్చే కస్టమర్లు కూడా క్షవరం చేయించుకునే సమయంలో తప్ప నిరీక్షించే సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలి.
► సెలూన్లలో వాడే అన్ని పరికరాలు, ఉపకరణాలు డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ చేయించి శుభ్రంగా ఉండాలి. ప్రతి కస్టమర్‌కు ప్రత్యేకంగా మెడ చుట్టూ వేసే వస్త్రం, టవల్, హెయిర్‌ క్యాప్‌ మొదలైనవి ప్రతి కస్టమర్‌కు ప్రత్యేకంగా వాడాలి. ఒకరికి వాడిన రేజర్లను మళ్లీ వాడకూడదు.
► సెలూన్లలోని కుర్చీలు, ఇతర ఫర్నిచర్, అద్దాలతోపాటు టాయిలెట్లు, బాత్‌రూంలు, సింకులను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. సెలూన్‌ను రోజూ తెరిచే ముందు, మూసివేసిన తరువాత మెట్లతోసహా సోడియం హైపో క్లోరైట్‌ పిచికారీ చేయాలి.

తక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు..
► అనారోగ్య లక్షణాలు ఉన్న వారిని అనుమతించకూడదు.
► సెలూన్‌లో పనిచేసేవారు తప్పనిసరిగా మాస్కు, గ్లౌజులు ధరించాలి.
► కస్టమర్లు ఎవరికి వారు టవల్, అవసరమైన ఇతర వస్త్రాలు తెచ్చుకోవాలి.
► ప్రతి కస్టమర్‌కు క్షవరం చేసిన తరువాత కుర్చీ, ఇతర ఫర్నిచర్‌ను తప్పనిసరిగా డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ చేయాలి. రేజర్లను ఒకసారే వాడాలి.
► సెలూన్‌లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.
► కస్టమర్ల వివరాలను నమోదు చేసేందుకు ఓ రిజిస్టర్‌ను నిర్వహించాలి.

tags : ap, saloons

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info