A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో దుకాణాలు తెరవడానికి మార్గదర్శకాలు ఇవి
Share |
May 26 2020, 3:10 pm

జిల్లా అధికార యంత్రాంగం నోటిఫై చేసిన కట్టడి ప్రాంతాలు మినహా... ఇతర ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చునని ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబందించి విది,విదానాలను మున్సిపల్ శాఖ విడుదల చేసింది.
పట్టణ ప్రాంతాల్లో అనుమతించిన దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరవొచ్చు. మందుల దుకాణాలకు మరింత సమయం అనుమతిస్తారు.


దుకాణ యజమానులదే బాధ్యత
► దుకాణాల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఆ బాధ్యత దుకాణ యజమానులదే. అందుకోసం దుకాణాల లోపల, బయట వృత్తాకార మార్కింగులు వేయాలి. దుకాణాల లోపల గరిష్టంగా ఐదు మందికి మించి అనుమతి లేదు. అక్కడ పనిచేసేవారు, కొనుగోలుదారులు కచ్చితంగా మాస్కులు ధరించాలి.
► దుకాణాలను రోజు తెరిచే ముందు ప్రవేశ ద్వారాలు, బయటకు వేళ్లే ద్వారాలు, పార్కింగ్‌ ప్రదేశాలు, లిఫ్టులలో శానిటేషన్‌ చేయాలి. తలుపుల హ్యాండిళ్లు, రైలింగులు, లిఫ్ట్‌ బటన్లు మొదలైనవి ఎర్ర రంగుతో మార్కింగ్‌ చేసి తరచూ శానిటేషన్‌ చేయాలి. టాయిలెట్లలో శానిటైజేషన్‌పై శ్రద్ధ చూపించాలి.
► అన్ని దుకాణాలు 50% సిబ్బందితోనే పనిచేయాలి.
► దుకాణాల్లో పనిచేసే సిబ్బంది అందరూ తమ మొబైల్‌ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వృద్ధులు, చిన్న పిల్లలను వీలైనంతవరకూ దుకాణాల్లోకి అనుమతించకూడదు.
► ఉన్నంత వరకు దుకాణాల్లోకి ప్రవేశించేందుకు, బయటకు వచ్చేందుకు ద్వారాలు వేర్వేరుగా ఉండాలి.
► ఎక్కువ బిల్లింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేయాలి. వీలైనంతవరకు నగదు రహిత లావాదేవీలకే ప్రాధాన్యమివ్వాలి.
అనంతపురం పాతవూరులో షాపులు తెరవడంతో మొదలైన సందడి

వీటికి ప్రత్యేక అనుమతి
► స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్టేడియంలు తెరిచేందుకు అనుమతిచ్చారు. క్రీడాకారులు, శిక్షకులకు మాత్రమే ప్రవేశం ఉంది. సందర్శకులను అనుమతించరు.
► ఆహార పదార్థాలను డోర్‌ డెలివరీ చేసే, టేక్‌ అవే సదుపాయం ఉన్న రెస్టారెంట్లకు అనుమతి. అలాగే వైద్య, ఆరోగ్య, పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం, వలస కార్మికులు, విదేశీ టూరిస్టులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో వారికి ఆహార పదార్థాలు అందించేందుకు ఉద్దేశించిన హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి.
► బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో ఉన్న క్యాంటీన్లకు అనుమతి ఉంది.

తెరిచేందుకు అనుమతిలేనివి
► సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్, ఎస్లాబ్లిష్‌మెంట్‌ పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు, బంగారు ఆభరణాలు, బట్టలు, చెప్పుల దుకాణాలు.

ప్రత్యేక చర్యలతో సెలూన్లకు అనుమతి
► స్పాలు, మసాజ్‌ సెంటర్ల నిర్వహణకు అనుమతి లేదు. కానీ సెలూన్లకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. అందుకోసం వారు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఎక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు, తక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం వేర్వేరుగా నిర్దేశించింది.

tags : ap, shops

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info