A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అయినా చంద్రబాబు ఎపికి వస్తానని అనలేదు
Share |
May 27 2020, 12:52 am

తాను ఆంధ్రలో లేనని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తోసిపుచ్చారు. తమ పార్టీ నేతలు అక్కడే ఉన్నారు. వారు విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితుల పరామర్శకు వెళ్తే రానివ్వలేదని ఆయన అన్నారు. మడ అడవుల సందర్శనకు వెళ్తే అడ్డుకున్నారు. ఆవ భూము ల అవినీతి చూడకుండా ఆపుచేశారు. తాను రాష్ట్రంలో లేకపోయినా తన మనసు అక్కడే ఉంని ఆయన అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందిస్తూనే ఉన్నానని ఆయన పేర్కొన్నారు.తన ప్రశ్నలకు జవాబివ్వలేక జగన్‌ పారిపోతున్నారని, ఏ ప్రశ్నలకైనా సమాధానం ఇవ్వగలిగిన తాను ధైర్యంగా ముందుకొస్తున్నానని ఆయన అన్నారు.


గతంలో జగన్ హైదరాబాద్ లో ఇల్లు పెట్టుకున్నాడని విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఇన్నాళ్ల తర్వాత కూడా హైదరాబాద్ నుంచి ఎపికి వెళతానని అనడం లేదు..అది విశేషం.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info