A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోతిరెడ్డిపాడు మేమే పూర్తి చేశాం-చంద్రబాబు
Share |
May 27 2020, 1:58 am

మొత్తం మీద పోతిరెడ్డిపాడు మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మౌనం వీడారు. పైగా పోతిరెడ్డి ప్రాజెక్టును ఎన్.టి.ఆర్.మొదలు పెడితే తాను పూర్తి చేశానని కూడా చెప్పారని వార్త వచ్చింది. రాయలసీమకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులన్నీ ప్రారంబించింది ఎన్.టి.ఆర్.అని ఆయన అన్నారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడుపై టీడీపీ మౌనవ్రతం అవలంబిస్తోందని వైసీపీ నేతలు చేసిన విమర్శలను తోసిపుచ్చారు. సీమ నీటి ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు టీడీపీకే ఉందన్నారు. ఎన్.టిఆర్. తెలుగుగంగ ప్రాజెక్టు చేపట్టారని, తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి అన్నీ ఆయనే ప్రారంభించారని చంద్రబాబు చెప్పారు. వాటన్నిటినీ తాము పూర్తిచేశాం అని చెప్పారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అయితే.. ముచ్చుమర్రి రాయలసీమకు జీవనాడి అని ఆనాడే చెప్పాం. దానిని పూర్తిచేశాం. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేసి దాని ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు ఇచ్చాం అని ఆయన అన్నారు. మిగులు జలాల ఆధారంగా ఎన్టీఆర్‌ ప్రాజెక్టులు చేపడితే రాజశేఖరరెడ్డి వాటిపై నానా రభస చేశారని, ఇప్పుడు ఆ ప్రాజెక్టులే దిక్కయ్యాయని తెలిపారు. ట్రైబ్యునల్‌ ఆంధ్రకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తోందని, వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ‘కర్నూలులో దీక్షచేసి కాళేశ్వరం కడితే ఇండియా, పాకిస్ధాన్‌ మధ్య యుద్ధం వచ్చినట్లు అవుతుందని జగన్‌ మాట్లాడారు. తర్వాత తానే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి వెళ్లి వచ్చాడు’ అనిచంద్రబాబు అన్నారు.రాయలసీమ ప్రాజెక్టులకు తన సహకారం ఉంటుందని ఆయన అన్నారు.

tags : chandrababu, potireddypadu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info