A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఫెయిల్
Share |
May 27 2020, 12:55 am

కరోనా కట్టడి అనేది సక్సెస్ లేదా ఫెయిల్యూర్ కాదని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా నియంత్రణకు ప్రయత్నం చేయాలని, ఎక్కువ కరోనా కేసులు వచ్చాయని భయపడకూడదని ఆయన పేర్కొన్నారు.అలాగే తక్కువ కేసులు వచ్చాయని ఆనంద పడకూడదన్నారు. చంద్రబాబు ఆలోచనలు మాత్రం దుర్బుద్ధితోనే ఉన్నాయి. ఒక్కరోజైనా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చారా? మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు.. సాయంత్రానికి రూ.కోటితో ప్రాణాలు వస్తాయా? అని మాట మార్చారు. రూ.25 లక్షలతో ప్రాణాలు తిరిగి వస్తాయా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఓఎన్‌జీసీలో ప్రమాదం జరిగితే బాబు ప్రభుత్వంలో రూ.2 లక్షల పరిహారం ఇచ్చింది. ఇలాంటి క్యారెక్టర్ ఉండే నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు. కరోనా కాలంలో ఉద్యోగులు సహకరిస్తుంటే.. చంద్రబాబు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియదు. చంద్రబాబు అధికారంలో ఉండి రైతు రుణమాఫీని అమలు చేయలేక పోయారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మేనిఫెస్టోలోని అంశాలతో పాటు చెప్పనివి కూడా అమలు చేశారు. ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారని సజ్జల పేర్కొన్నారు.

tags : sajja;a

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info