A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పురోహితులకు ఆర్దిక సాయం చేయాలి-పవన్
Share |
May 26 2020, 2:06 pm

పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలని కోరుతూ జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఇది.

• బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను సక్రమంగా వినియోగించాలి
కరోనా లాక్డౌన్ మూలంగా ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నవారిలో
పౌరోహిత్యంపైనే ఆధారపడ్డ బ్రాహ్మణ కుటుంబాలు వేలల్లో ఉన్నాయి.
వివాహాలు, గృహ ప్రవేశాల ముహూర్తాలు ఉన్న సమయంలోనే లాక్డౌన్ రావడంతో
పురోహితుల ఉపాధి దెబ్బ తిని తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఇతరత్రా
శుభకార్యాలు కావచ్చు, కర్మకాండలు చేయించే అవకాశాలు కూడా వారికి
లేకుండాపోయాయి. పౌరోహిత్యంపై ఆధారపడ్డవారు ఎదుర్కొంటున్న కష్టాలను
ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సవివరంగా తెలియచేసింది. ఈ నెల
24వ తేదీ తరవాత కొన్ని నెలలపాటు ముహూర్తాలు కూడా లేకపోవడం వల్ల పురోహితుల
జీవనం మరింత గడ్డుగా మారుతుందని సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ
శ్రీ తేజోమూర్తుల లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు. తమకు ఈ ఆపత్కాలంలో
నెలకు కనీసం రూ.5 వేలు సహాయం, నిత్యావసరాలు అందించాలని కోరుతున్నారు. వారి
విన్నపం సమంజసంగానే ఉంది. పౌరోహిత్యంపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక
భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ యేడాది బడ్జెట్ లో
బ్రాహ్మణ కార్పొరేషన్ కి కేటాయించిన రూ.100 కోట్లను ఎటూ మళ్లించకుండా
సక్రమంగా వినియోగించాలి. పేద బ్రాహ్మణ విద్యార్థులకు, పేద కుటుంబాలకు
సకాలంలో విడుదల చేస్తేనే ప్రయోజనం చేకూరుతుంది.
- పవన్ కల్యాణ్
అధ్యక్షులు, జనసేన

tags : pawankalyan

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info