A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా కు ముస్లింలను బాద్యులను చేయవద్దు
Share |
May 27 2020, 2:03 am

ముస్లీంల‌కురంజాన్ పండుగ శుభాకాంక్ష‌లు. ఏ మ‌త సారాంశ‌మైనా ఒక్క‌టే. దేవుడు ఒక్క‌డే. అన్ని మ‌తాల‌ను గౌర‌విస్తాను. అంద‌రు దేవుళ్ళ‌కు మొక్కుతాను. అందుకే నేను ఓటమి లేకుండా గెలుస్తున్నాను. అన్నారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. క‌రోనా
వ్యాప్తికి ముస్లీంల‌ను బాధ్యుల‌ని చేయొద్దు. ఒక‌రిద్ద‌రు చేసిన త‌ప్పుల‌కు అంద‌రినీ బ‌లితీసుకోవ‌ద్దు. మ‌న‌ది గొప్ప సంస్కృతి, మ‌తాలేవైనా మ‌న‌మంతా పాలు నీళ్ళ‌లా క‌లిసిపోతాం. గంగా జ‌మునా త‌హజీబ్. అన్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్ద‌వంగ‌ర మండ‌ల కేంద్రాల్లో ముస్లీం కుటుంబాల‌కు రంజాన్ ప‌ర్వ‌దిన వ‌స్తువుల‌తో కూడిన నిత్యావ‌స‌ర
స‌రుకుల‌కును  మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు బుధ‌వారం పంపిణీ చేశారు.
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, క‌రోనా వైర‌స్ ని అంతం చేయ‌డం అంత ఈజీ కాద‌న్నారు. అనేక మంది శాస్త్ర‌వేత్త‌లు,
వైద్యులు కూడా ఇదే విష‌యాన్నిచెబుతున్నార‌న్నారు. టీకాలు వ‌చ్చినా స‌రే,  మ‌నం మ‌రికొన్నేళ్ళు అంటే క‌నీసం ఒక‌టి
రెండేళ్ళైనా స‌రే, క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందేన‌ని వారంటున్నార‌న్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనాతో పూర్తిగా
భ‌య‌ప‌డాల్సింది లేద‌ని, అలాగ‌ని నిర్ల‌క్ష్యంగా కూడా ఉండ‌వ‌ద్ద‌ని మంత్రి ప్ర‌జ‌ల‌కు హిత‌వు ప‌లికారు.
జ‌లుబు, జ్వ‌రం, గొంతు నొప్పి వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే స‌మీపంలోని ప్ర‌భుత్వ వైద్యుల‌ని సంప్ర‌దించాల‌న్నారు.
అలాగ‌ని ఈ ల‌క్ష‌ణాల‌న్నీ క‌రోనా అనుకోవ‌డానికి లేద‌న్నారు. కొద్దిగా ఇబ్బందిక‌రంగా ఉన్న ప‌రిస్థితి ఇది. దీన్ని
అదిగ‌మించ‌డానికి కొద్ది స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా, స్వీయ నియంత్ర‌ణ‌లో ఉండాల‌ని
సూచించారు. సిఎం కెసిఆర్ తీసుకున్న అద్భుత సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలే ఇవ్వాళ మ‌న‌ల్ని ఈ స్థితిలో
ఉంచాయ‌న్నారు. కెసిఆర్ ప్ర‌జ‌ల ప్రాణాలే ముఖ్య‌మ‌ని, ఆర్థిక వ్య‌వ‌స్థ ఇబ్బందులు ప‌డుతున్నా లెక్క చేయ‌లేద‌న్నారు.
ప్ర‌జ‌ల్ని క‌న్న‌బిడ్డ‌ల్లా చూసుకునే సీఎం మ‌న‌కు ఉన్నందుకు గ‌ర్వ ప‌డాల‌ని మంత్రి చెప్పారు.
తొర్రూరులో ముస్లీంల‌కు పండుగ ఒక్క‌రోజు స‌రుకుల‌ను డాక్ట‌ర్ సోమేశ్వ‌ర‌రావు ఇచ్చార‌ని, ఆయ‌న్ని అభినందించారు. త‌న
కొడుకు, కూతురు కుటుంబం స‌హా, అనేక మంది దాత‌లు ముందుకు రావడం వ‌ల్లే తాను త‌న ట్ర‌స్టు త‌ర‌పున‌, ఇత‌రుల
ప‌క్షాన వేలాది మంది కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేయ‌గ‌ల‌గ‌న‌ట్లు మంత్రి వివ‌రించారు.
ఈ కార్య‌క్ర‌మంలో మంత్రితోపాటు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ముస్లీం మ‌త పెద్ద‌లు, ముస్లీం కుటుంబాల‌కు చెందిన అనేక
మంది మ‌హిళ‌లు పాల్గొన్నారు.

tags : errabelli

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info