A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో కరోనా నేపద్యంలో కలెక్టర్ లకు పవర్స్
Share |
April 3 2020, 4:41 pm

ఎపిలో కరోనాను నియంత్రించడంకోసం జిల్లా కలెక్టర్ లకు, మున్సిపల్ కమిషనర్ లకు ప్రభుత్వం మరిన్ని అదికారాలు ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ అంటువ్యాధుల చట్టం-1897లో ప్రభుత్వం మరిన్ని నిబంధనలు చేర్చింది. ఆరోగ్య శాఖ కమిషనర్‌, డీఎంఈ, డీహెచ్‌, ఏపీవీవీపీ కమిషనర్‌, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు ఆయా జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.కరోనా లక్షణాలున్న వ్యక్తులకు డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర నిబంధనల ప్రకారం చికిత్స అందించాలి. ఏదైనా ఒక ప్రాంతంలో కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారి.. సదరు వైరస్‌ మరోసారి ఆ ప్రాంతంపై ప్రభావం చూపని విధంగా సంపూర్ణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఈ ఏర్పాట్లు చేయాలి ప్రజారోగ్యం దృష్ట్యా కలెక్టరు ఇచ్చే ఆదేశాలను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు విధిగా పాటించాలి.

tags : ap,carona

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info