A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డాక్టర్ లకు ఇళ్లివ్వరా-కేంద్రం వార్నింగ్
Share |
August 4 2020, 3:58 pm

ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ స్టాఫ్‌కు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. ఈమేరకు జిల్లా మెజిస్ట్రేట్‌, జోనల్‌ డిప్యూటీ కమిషనర్‌, డీసీపీలకు విస్తృత అధికారాలు కల్పిస్తున్నట్టు కేంద్రం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాగా, కరోనా పేషంట్లకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి వైరస్‌ సోకుందనే భయాల నేపథ్యంలో.. ఢిల్లీలోని కొందరు ఇంటి యజమానులు వాళ్లను ఖాళీ చేయించారు. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు విషయాన్ని హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. దానిపై ఆయన స్పందించారు. అత్యవసర సేవల్ని అడ్డుకుంటున్న వారు ఢిల్లీ అంటు వ్యాధుల నియంత్రణ చట్టం, కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం శిక్షార్హలవుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇల్లు ఖాళీ చేయాలని వేధిస్తున్నవారిపై కేసులు నమోదు చేయాలని పేర్కొంది.
ఇదే విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రజలకు సేవ చేసేవారిపట్ల ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు.

tags : center, doctors

Latest News
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info