A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ ప్రైవేటు హాస్టళ్ల విద్యార్ధులకు ఊరట
Share |
August 4 2020, 4:23 pm

ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్నవారికి వెసులుబాటు లభించింది.నిర్వాహకులు హాస్టళ్ళను ఖాళీ చేయాలని చెబుతుండడంతో హైదరాబాద్ లోని అనేక మంది విద్యార్ధులు,యువకులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.తాము స్వస్థలాలకు వెళ్లడానికి వీలుగా పాస్ లు ఇవ్వాలని కోరారు. దానిపై ఆలోచన చేసిన పోలీసులు అలా వచ్చిన విద్యార్ధులందరికి పాసులు ఇచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేలా పాసులు మంజూరు చేశామని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. ఎస్‌ఆర్‌నగర్‌ వద్ద విద్యార్థులు తమకు అనుమతి పత్రాలు ఇవ్వాలంటూ గుంపులు గుంపులుగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాల కోసం హాస్టల్‌ ఓనర్‌ నుంచి లెటర్‌ తీసుకురావాలని, వారిని తిరిగి హాస్టళ్లకు పంపించారు.

tags : hyderabad, hostels

Latest News
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info