A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో కరోనా విజృంభణ
Share |
April 3 2020, 3:55 pm

చైనాలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లు వార్తలు వస్తుంటే, అమెరికాలో మాత్రం రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల వ్యవధిలోనే పదివేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో అమెరికాలో కోవిడ్‌ బాధితుల సంఖ్య 49,594కు చేరుకుంది. ఒకే రోజు 130 మంది మరణించారు. మృతుల సంఖ్య 622కి పెరిగింది.
అయితే మొత్తం పరిశ్రమలు, ఆర్దిక వ్యవస్థలను స్తంభింప చేయడానికి అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుముఖంగా లేకపోవడం విశేషం.
మాస్కులు, శానిటైజర్లు ఇతర మందులను నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా నిల్వ చేసినా శిక్ష తప్పదన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌ ప్రస్తుతం కోవిడ్‌కు కేంద్రబిందువుగా మారింది. అమెరికాలో కోవిడ్‌ బారిన పడ్డ ప్రతి ఇద్దరిలో ఒక్కరు న్యూయార్క్‌కు చెందిన వారే. సోమవారం సుమారు 5085 కొత్త కేసులు నమోదు కావడంతో ఈ మహానగరంలో ఇప్పటివరకూ ఉన్న కేసుల సంఖ్య 20,875కు ఎగబాకింది. న్యూయార్క్‌లో ఇప్పటికే 43 మంది మరణించారు. న్యూయార్క్‌ నగరం, మెట్రో ఏరియా, న్యూజెర్సీ, లాండ్‌ ఐలాండ్‌ ప్రాంతాల్లో ప్రతి వెయ్యిమందిలో ఒకరు వ్యాధి బారిన పడ్డారని వైట్‌హౌస్‌లో కరోనా టాస్క్‌ఫోర్స్‌ అధికారి డెబ్రా ఎల్‌ బ్రిక్స్‌ తెలిపారు.

tags : america, carona

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info