A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సచివాలయంలో ఐఎఎస్ లతో కంట్రోల్ రూమ్
Share |
April 8 2020, 8:01 pm

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ఈ నెల 31 వరకు రాష్ట్రంలో ప్రకటించిన లాక్
డౌన్ కు సంబంధించి జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను పకడ్బందిగా అమలు చేయాలని,
జి.ఒ 45, 46 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
శ్రీ సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ రోజు కరోనా వైరస్ (COVID-19) నియంత్రణ పై
బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను
పూర్తిగా అమలు చేయాలని, ద్విచక్ర వాహనం పై ఒక వ్యక్తి, ఫోర్ వీలర్స్ పై ఇద్దరికి
మించకుండా అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఎవరిని కూడా రాత్రి 7.00
గంటల తర్వాత నుండి తదుపరి రోజు ఉదయం 6.00 గంటల లోపు అత్యవసర వైద్య చికిత్స
మినహా ఏ కారణం పైన కూడా రోడ్లపైకి అనుమతించరాదని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులైన పాలు, కూరగాయలు మరియు
ఔషదములు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూడాలన్నారు మరియు ఎక్కువ ధరలకు
అమ్మకుండా ఖచ్చితంగా పర్యవేక్షించాలన్నారు. చెక్ పోస్ట్ లలో నిత్యావసర వస్తువుల రవాణా
కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.
సచివాలయంలో ఇద్దరు సీనియర్ ఐ.ఎ.ఎస్ అధికారులు రాహుల్ బొజ్జ, అనిల్
కుమార్ లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వీరు ఎప్పటికప్పుడు తగు సూచనలు
ఇస్తారని అన్నారు. ఇదే తరహాలో జిల్లాలలో కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
చేయాలన్నారు.
జిల్లాలలో కనీసం రెండు జిల్లా Quarantine సెంటర్లను సదుపాయాలతో ఏర్పాటు
చేయాలని అన్నారు. కలెక్టర్లు ఎవరి కుటుంబాలలో నైన విదేశీ పర్యటనలు చేసివచ్చిన వారు,
ఖచ్చితంగా Home Quarantined లో ఉన్న వారి వివరాలు సేకరించడానికి Inter
disciplinary teams ఏర్పాటు చేయాలని అన్నారు. రోజువారి నివేదికలు కంట్రోల్ రూమ్ కు
పంపాలన్నారు. జిల్లాలలో Quarantine activities ను మానిటర్ చేయడానికి App ని
రూపొందించామని అన్నారు.

గ్రామాలలో రైతులు గుమిగూడకుండా వుండానికి గ్రామ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో
వరి సేకరణ కేంద్రాలను పెంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు మరియు రైతులు ఒకరికి
ఒకరు సమీపంగా కాకుండా తగినంత దూరంలో ఉండి పరిశుభ్రత పాటించడానికి తగిన
జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు తెలిపారు.

ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్య కార్యదర్శి వికాస్
రాజ్, కార్యదర్శులు రాహుల్ బొజ్జా, జనార్దన్ రెడ్డి, రిజ్వి, సందీప్ కుమార్ సుల్తానియా ,
సంజయ్ జాజు, రోనాల్డ్ రోస్, సర్ఫరాజ్ అహ్మద్, డైరెక్టర్ , ఎక్సైజ్, రజత్ కుమార్ షైనీ,
సి.సిఎల్.ఎ డైరెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

tags : soemesh

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info