A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇళ్లకు వెళ్లి పరీక్షలు చేస్తున్న డాక్టర్ లు
Share |
April 3 2020, 3:32 pm

ఎపిలో ఆయా చోట్ల వైద్య శాఖ అదికారులు విదేశాల నుంచి వచ్చినవారి ఇళ్లకు వెళ్లి వారు ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.ఉదాహరణకు ఎస్.కోట మండలం లో సుమారు 14మంది సింగపూర్, అమెరికా, ఫిలిప్పీన్స్, దుబాయ్, మలేసియా, మక్కా తదితర దేశాల నుంచి వచ్చారని అదికారులు తెలిపారు. వీరిలో ఐదుగురు వ్యక్తులు 14 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న గడువు కూడా ముగిసిందని కొట్టాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ముమ్ములూరి ఫణీంద్ర తెలిపారు. మండలంలోని బొడ్డవర, కొట్టాం, శృంగవరపుకోట తదితర గ్రామాల్లో ఉన్న సచివాలయాలను వైద్య సిబ్బంది సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ఫణీంద్ర మాట్లాడుతూ సుమారు 14మంది విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వీరిలో ఎవరికీ కూడా కరోనా వ్యాధి లక్షణాలు లేవని పేర్కొన్నారు. వీరందరినీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 14 రోజులు గృహ నిర్బంధంలో స్వచ్ఛందంగా ఉండాలని నోటీసులు అందజేశామన్నారు. రోజూ గృహనిర్బంధంలో ఉన్న వారి ఇళ్లకు వైద్య సిబ్బంది వెళ్లి బీపీ, షుగర్, జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలను పరీక్షిస్తున్నామని తెలిపారు.

tags : ap,doctors

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info