A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
3 వారాలపాటు దేశం అంతా లాక్ డౌన్ -మోడి
Share |
April 3 2020, 4:15 pm

దేశ ప్రజలందరికి ఇది పరీక్ష సమయం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జనతా కర్ప్యూని ఎలా విజయవంతం చేశారో, అలాగే మరి కొన్నాళ్లు ప్రజలు సంయమనం పాటించాలని, ఇళ్లలోనే ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రపంచలో పెద్ద ,పెద్ద అగ్ర దేశాలను కూడా వణికిస్తోందని ఆయన అన్నారు.కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని , కొన్ని దేశాలలో అది తీవ్ర రూపం దాల్చిందని ఆయన అన్నారు.వైద్య నిపుణులు చెబుతున్నది కరోనాకు మందు కేవలం సోషల్ డిస్టెన్స్ నిర్వహించడమేనని ఆయన అన్నారు. ఒకరికి దగ్గరగా ఉండడం వల్ల అంటు వ్యాది సోకే అవకాశం ఉందని అన్నారు.సమష్టిగా కరోనా పై పోరాటం చేయాలని ఆయన అన్నారు. మనల్ని మనంకాపాడుకోవాలని, మన కుటుంబాన్ని, మన స్నేహితులను,మన సమాజాన్ని, మన దేశాన్ని రక్షించుకోవాలని ఆయన అన్నారు.వ్యాధి లక్షణాలు ఉన్నవారే కాకుండా అంతా సామాజిక దూరం పాటించాలని ఆయన అన్నారు. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి పూర్తి లాక్ డౌన్ జరగాలని మోడీ పిలుపు ఇచ్చారు. ఇది దేశానికి అవసరం అని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీనిని పాటించాలని ఆయన అన్నారు.దేశాన్ని కాపాడుకోవడానికి ఇది తప్పనిసరి అన్నారు.లాక్ డౌన్ మూడువారాల పాటు అవసరం అవుతుందని ఆయన అన్నారు.కరోనాను పారదోలడానికి ఇది అవసరమని అన్నారు. దీనిని పాటించకపోతే ఇరవైఏళ్లు మనం దెబ్బతింటామని ఆయన అన్నారు.తాను ప్ రదాని గా మాట్లాడడం లేదని, మీ కుటుంబ సభ్యుడిగా చెబుతున్నానని యాన అన్నారు. ఈ 21 రోజులు ఇంటిలోనే ఉండాలని ఆయన అన్నారు.

tags : modi

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info