A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగనన్న విద్యాదీవెన మార్గదర్శకాలు
Share |
April 8 2020, 8:04 pm

ఎపి ప్రభుత్వం ‘జగనన్న విద్యా దీవెన’ పథకం అమలుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర జీవో 14 విడుదల చేశారు.


‘జగనన్న విద్యా దీవెన’ మార్గదర్శకాలు ఇవీ..
- ఫీజులపై రాష్ట్ర ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ నోటిఫికేషన్‌కు కాలేజీలు అంగీకరించి ఉండాలి. క్యాపిటేషన్‌ ఫీజు తదితర అనధికారిక ఫీజులు (డొనేషన్లు లాంటివి) వసూలు చేయరాదు.
- ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు భిన్నంగా ఇతర ఫీజులు వసూలు చేయరాదు. విద్యాసంస్థ నిర్వహణలో మిగులు లాభాన్ని తన సొంతానికి కాకుండా తిరిగి సంస్థ కోసం వెచ్చించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రాలేదనే సాకుతో విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయరాదు.
- యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఏపీఎస్‌సీహెచ్‌ఈ లాంటి నియంత్రణ సంస్థల ఆదేశాలను పాటించాలి. ఆన్‌లైన్‌ అఫ్లియేషన్, అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలి. విద్యార్థులవారీగా అకడమిక్‌ పెర్ఫార్మెన్సు తదితర రికార్డులను సంబంధిత విభాగాలకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
- విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది హాజరును తప్పనిసరిగా ఆధార్‌ అనుసంధానిత బయోమెట్రిక్‌ హాజరు ద్వారా నమోదు చేయాలి. 75 శాతం కన్నా హాజరు తగ్గితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు.
- సెక్యూరిటీ, డేటా గోప్యత ప్రోటోకాల్‌ను పాటించాలి. ప్రభుత్వం, సంబంధిత రెగ్యులేటరీ సంస్థలు అనుమతించే కోర్సులతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిర్దేశించిన కోర్సులను మాత్రమే నిర్వహిస్తూ ఉండాలి.
- మార్గదర్శకాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు, యాజమాన్యాలపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది. ఆ కాలేజీలను ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నుంచి తప్పిస్తారు.
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిర్దేశించిన ఆదాయ పరిమితి ప్రకారం గుర్తింపు కలిగిన సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. డీమ్డ్‌ వర్సిటీలు, ప్రైవేట్‌ వర్సిటీలకు ఈ పథకం వర్తించదు. దూర విద్య, కరస్పాండెన్స్‌ కోర్సులు చదివే విద్యార్థులు, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా విద్యార్థులకు ఈ స్కీము వర్తించదు. సాంఘిక సంక్షేమ శాఖ ఈ పథకానికి నోడల్‌ విభాగంగా పనిచేస్తుంది.

tags : ap, education

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info