A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్యాంకులకు అనవరంగా రాకండి
Share |
April 3 2020, 4:29 pm

అవసరం ఉంటే తప్ప బ్యాంకులకు రావొద్దు.. మాకు మీ సాయం కూడా అవసరం: బ్యాంకు ఉద్యోగుల సంఘం విన్నపం


ఆన్‌లైన్, మొబైల్ సేవలను వినియోగించుకోండి
అన్ని రకాల సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం
అందరూ ఎదుర్కొంటున్న సమస్యనే ఉద్యోగులూ ఎదుర్కొంటున్నారు
బ్యాంకు ఖాతాదారులకు అన్ని సేవలు అందిస్తామని అయితే, అత్యవసరం అయితే తప్ప బ్యాంకుకు రావొద్దని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీవో) విజ్ఞప్తి చేసింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, శక్తివంచన లేకుండా పనిచేస్తామని పేర్కొంది. వీలైనంత వరకు అన్ని సేవలు అందిస్తామని, ఈ విషయంలో వినియోగదారులు కూడా తమవైపు నుంచి సాయం చేయాలని కోరింది. ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్యలనే బ్యాంకు ఉద్యోగులు కూడా ఎదుర్కొంటున్నారని, కాబట్టి అత్యవసరం అనుకుంటే తప్ప బ్రాంచ్‌లకు రావొద్దని కోరింది.

మొబైల్, ఆన్‌లైన్ బ్యాకింగ్ చానల్స్ ద్వారా అందుబాటులో ఉన్న నాన్-ఎస్సెన్షియల్ సేవలను ఉపయోగించుకోవాలని, 24 గంటలూ ఆ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఐబీవో అధికారులు తెలిపారు. అవసరం అనుకుంటే బ్యాంకులకు ఫోన్ చేయొచ్చని, ఐవీఆర్ సదుపాయాన్ని కూడా పొందొచ్చని పేర్కొన్నారు. నగదు జమ, ఉపసంహరణ, చెక్ క్లియరెన్స్, రెమిటెన్స్, ప్రభుత్వ పరమైన లావాదేవీలు వంటివి తప్పకుండా అందుబాటులో ఉంటాయని వివరించారు.

tags : banks

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info