A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతుల వద్దకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
Share |
March 1 2021, 6:37 am

రైతు చెంతకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెళతాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ఇలా ఉంది..
  - కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దానిని అరికడుతూనే రైతులకు అసౌకర్యం కలగకూడదన్నది ముఖ్యమంత్రి
కేసీఆర్ గారి ఉద్దేశం

- రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోండి

- ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో పరిమితులు అవసరం లేదు
- ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.25 వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీకై ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాలిచ్చారు..
రాష్ట్ర రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు
- రబీలో పండిన మొక్కజొన్నలను రూ.1760 కి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు .. పౌల్ట్రీ సంక్షోభం
నేపథ్యంలో రైతులు నష్టపోకుండా చర్యలు.. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు వెంటనే కొనుగోలు చేయాలని సీఎం గారి
ఆదేశాలు
- గ్రామాల రైతులు పట్టణ మార్కెట్ల వరకూ రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం

- విధిగా  ఏ గ్రామ రైతు ఆ గ్రామంలోనే ధాన్యం అమ్మకాలు చేసుకునే అవకాశం కల్పించండి

- వ్యవసాయ ఉత్పత్తులు భారీగా వస్తున్న సంధర్భం .. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన పరిస్థితులలో ప్రభుత్వ
ఆంక్షలకు అడ్డురాకుండా చర్యలు తీసుకోవాలి

- కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువ మంది రైతులు గుమికూడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు

- గ్రామాల వారీగా ధాన్యం అమ్మకానికి వచ్చే పరిస్థితులు అంచనా వేసి కొనుగోళ్లకు టోకెన్ ద్వారా ఏర్పాట్లు

- ఆకాలవర్షాలు వస్తే కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్ల సరఫరా

- 38.19 లక్షల ఎకరాలలో ఈసారి వరి సాగుచేశారు
- ప్రతి ఏటా ధాన్యం దిగుబడులు పెరుగుతాయి తప్ప తగ్గే పరిస్థితి లేదు
- టార్పాలిన్లను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచండి .. కొత్తగా 60 వేల టార్పాలిన్లను త్వరగా కొనుగోలు
చేయాలని మార్కెటింగ్ శాఖకు ఆదేశాలు .. వచ్చే నెల 15 వరకు అన్నీ అందుబాటులోకి తీసుకురండి
- తేమ నిర్ధారణ యంత్రాలు కొరత లేకుండా చూసుకోవాల్సిందిగా ఆదేశాలు .. అవసరమయితే కొత్తవి కొనుగోలు చేయాలని
ఆదేశాలు
- గన్నీ బ్యాగుల కొరత రాకుండా ముందే సిద్దం చేసుకోండి

- రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి

- పట్టణ వ్యవసాయ మార్కెట్ల వరకూ రైతులు ధాన్యం తెచ్చే అవకాశం రానివ్వం
- ఇతర రాష్ట్రాల నుండి , రాష్ట్రం నుండి పట్టణాలు, గ్రామాలకు వచ్చే పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ట్రాఫిక్
జామ్ కారణంగా ఆగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు .. టోల్ ప్లాజాలు చెక్ పోస్ట్ ల వద్ద అంతరాయం లేకుండా చర్యలు
- అధిక ధరలకు నిత్యావసరాలు అమ్మితే కఠిన చర్యలు .. దీనిని అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు .. జీఓ విడుదల

- విత్తనాలు, ఫర్టిలైజర్ ఈసీ యాక్ట్ లో ఉన్నందున వాటి రవాణా, సరఫరా పై ఎటువంటి ఆంక్షలుండవు
- ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కరోనా వైరస్  కారణంగా ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వ
లాక్ డౌన్ ఆంక్షలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై బీఆర్ కేఆర్ భవన్ లో జరిగిన సమీక్షా సమావేశానికి
హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ గారు,
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు,  పౌరసరఫరాల
శాఖ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మార్క్ ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి గారు, పౌరసరఫరాల శాఖ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి
గారు, సహకార శాఖ కమీషనర్ వీరబ్రహ్మయ్య గారు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి గారు, విత్తనాభివృద్ది సంస్థ డైరెక్టర్
కేశవులు గారు, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి గారు, అగ్రోస్ ఎండీ రాములు గారు తదితరులు
- అనంతరం హాకాభవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి గారు

tags : niranjjanreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info