A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఇసుక బల్క్ గా కూడా ప్రభుత్వమే సరఫరా
Share |
August 5 2020, 5:03 am

ఇసుక సరఫరాలో ఎపి ప్రభుత్వం కొత్త విదానం తీసుకు వస్తోంది. ఇకపై కాంట్రాక్టర్ లు , బిల్డర్ లకు కూడా అవసరమైన ఇసుకను టోకుగా లేదా బల్క్ గా సరఫరా చేయడానికి ఎపి ఖనిజాబివృద్ది సంస్థ ఏర్పాటు చేసుకుంటోందన్న సమాచారం వచ్చింది. టోకున ఇసుక తీసుకొని దానిని ఇతరులకు అధిక ధరలకు విక్రయించడం, లారీల యజమానులు ఎక్కువ రవాణా ఛార్జీలు వసూలు చేస్తుండటంతో.. వాటిని నియంత్రించేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారని కదనం వచ్చింది. వచ్చే వారమే దీనిని ఆరంభించనున్నారు. బల్క్ ఆర్డర్ లో తొలుత 50 టన్నులు పంపించి, అది అందినట్లు కాంట్రాక్టర్ చెప్పిన తర్వాతే మిగిలిన ఇసుకను పంపిస్తారు. ఇంటికే ఇసుక సరఫరా విధానం గత నెల 2న తొలుత కృష్ణా జిల్లాలో ఆరంభించగా, ఇపుడు కర్నూలు, చిత్తూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో క్రమంగా అమల్లోకి తెచ్చారు.

tags : ap,sand

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info