A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశంలో ఉన్నవన్నీ ప్రాంతీయ పార్టీలేనా
Share |
August 5 2020, 5:04 am

దేశంలో ఉన్నవన్ని ప్రాంతీయ పార్టీలే. జాతీయ పార్టీలు లేవు. కాకపోతే అవి పెద్ద ప్రాంతీయ పార్టీలు..ఇది టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు , తెలంగాణ మున్సిపల్,ఐటి శాఖల మంత్రి కె.తారక రామారావు విశ్లేషణ. ఒక సదస్సులో ఆయన చేసినీ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది.నిజానికి కేంద్రంలో పాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ 300పైగా స్థానాలతో అధికారంలోకి వచ్చింది.అలాంటి పార్టీని ప్రాంతీయ పార్టీ అంటావా అని బిజెపి మండిపడింది. ఇది కూడా వాస్తవమే. సొంత బలంతో అదికారంలోకి వచ్చిన బిజెపి పెద్ద ప్రాంతీయ పార్టీ ఎలా అవుతుంది?కెటిఆర్ వాదనలో పూర్తి వాస్తవం ఉందని అనుకోలేం.ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు కేవలం ఒక రాష్ట్రానికో, లేక మరో రాష్ట్రంలో కొంత భాగానికో పరిమితం అవుతాయి. కాని జాతీయ పార్టీలు అదికారంలోకి వచ్చినా, రాకపోయినా, దేశంలోని వివిధ రాష్ట్రాలలో తమ ప్రాంతినిద్యం కలిగి ఉంటాయి. వాటికి ఉనికి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 1989 తర్వాత ఎన్నడూ సొంతంగా అదికారంలోకి రాలేకపోయింది. పివి నరసింహారావు ప్రధాని అయినప్పుడు ఇతర పార్టీల సహకారంతోనో, లేక వాటిని చీల్చో అదికారంలో కొనసాగింది.వాజ్ పేయి అదికారంలోకి వచ్చినప్పుడు ఆయా భాగస్వామ్య పక్షాలతో కూడిన ఎన్.డి.ఎ. పాలన చేసింది. 2004,2009 లోను కాంగ్రెస్ ఐ కూడా అదికారంలోకి వచ్చింది. అప్పుడు భాగస్వామ్య పక్షాలతో కలిసి యుపిఎ ని ఏర్పాటు చేసుకుని పాలన సాగించింది.కాని 2014లోను, తదుపరి 2019లోను బిజెపి సొంతంగా మోడీ సారధ్యంలో అదికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాలలో విజయపరంపర సాగించింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలలో ఓటమిపాలయింది.ఉదాహరణకు మద్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గడ్ లలో బిజెపి అదికారం కోల్పోయింది. అలాగే మహారాష్ట్రలో చేతిదాకా వచ్చిన అదికారం అందకుండా పోయింది.విచిత్రంగా ఈ రాష్ట్రాలలో పార్లమెంటు ఎన్నికలలో మాత్రం బిజెపి ఘన విజయం సాదించింది. అంటే అవి మోడీకి పడిన ఓట్లా?లేక బిజెపికి వచ్చిన విజయమా? మోడీపైనే ఆదరణ అని చెప్పవలసి ఉంటుంది. ఒక దశలో ఇరవైపైకి రాష్ట్రాలలో అదికారంలో ఉన్న బిజెపి ఆ తర్వాత తగ్గడం కూడా గమనించదగ్గ పరిణామమే. దక్షిణాదిలో కర్నాటకలో తొలుత అదికారంలోకి రాలేకపోయినా, ఆ తర్వాత జెడిఎస్, కాంగ్రెస్ లలో కుంపటి పెట్టి అదికారంలోకి వచ్చింది. అది తప్ప దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఎపి,తెలంగాణలలో బిజెపి నామమాత్రంగానే ఉందని చెప్పాలి.అలాగే ఎమ్.పి,మహారాష్ట్ర, రాజస్తాన్,చత్తీస్ గడ్, జార్కండ్, పంజాబ్, డిల్లీ రాష్ట్రాలలో కూడా బిజెపి అదికారంలోకి రాలేకపోయింది.అంటే దేశంలో సగంపైగా రాష్ట్రాలలో బిజెపి అదికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయం.కాకపోతే, పంజాబ్, మద్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గడ్,పుదుచ్చేరి లలో అదికారంలో ఉండడం వారికి కాస్త ఉపశమనం కావచ్చు కాని కేంద్రంలో ప్రదాన ప్రతిపక్షం గా కూడా లేకపోవడం ఇబ్బందికరమే. అందువల్ల ఈ రెండు ప్రదాన పార్టీలు జాతీయ పార్టీలే అయినా దేశం అంతటా అదికారంలోకి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.ఇక వామపక్షాల పరిస్థితి పూర్తి అయోమయంగా ఉంది. ఒక్క కేరళలో తప్ప మరెక్కడ అదికారంలోకి కాదు కదా..ఉనినికి చాటుకోవడమే సమస్యగా ఉంది. పశ్చిమబెంగాల్ లో సిపిఎం ఓటమి తర్వాత ఇంతవరకు కోలుకోలేదు. అలాగే త్రిపురలో ఓడిపోవడం వారికి పూర్తిగా నిరాశ కలిగించే విషయంగా ఉంది. సిపిఐ, సిపిఎం లు జాతీయ హోదా నిలబెట్టుకోవడమే సమస్యగా ఉంది.ఇక ప్రాంతీయ పార్టీలు అదికారంలో ఉన్నచోట జాతీయ పార్టీలు పుంజుకోవడం కష్టం అవుతోంది. తెలంగాణలో టిఆర్ఎస్ హవా ముందు కాంగ్రెస్,బిజెపిలు నిలబడలేకపోతున్నాయి. ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వస్తే, టిడిపి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.ఇక్కడ కాంగ్రెస్, బిజెపిలు నామావశిష్టంగా మారాయి.తమిళనాడులో అన్నా డి.ఎమ్.కె., డి.ఎమ్. కెల మద్యే పోటీ సాగుతోంది. కొత్తగా రజనీకాంత్ పార్టీ పెడితే సమీకరణలు కొంత మారవచ్చేమో కాని,కాంగ్రెస్,బిజెపిలు అధికారంలోకి రాలేవు. కేరళలో కాంగ్రెస్,వామపక్షాల మద్య పోటీ ఉన్నా, కేంద్ర స్థాయి వచ్చేసరికి ఈ రెండు కలవాల్సి రావడం వైరుద్యంగా ఉంటోంది.పశ్చిమబెంగాల్, ఒడిషా, డిల్లీలలో కూడా ప్రాంతీయ పార్టీలే రాజ్యమేలుతున్నాయి. జాతీయ పార్టీల రాజకీయాలకు, ప్రాంతీయ పార్టీల రాజకీయాలకు మద్య స్పష్టమైన తేడా ఉంటుంది. జాతీయ పార్టీలలో నాయకత్వం డిల్లీ కేంద్రంగా ఉంటే, ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్ట్రాలలోనే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు ఎంతవరకు తమ రాష్ట్రంలో ఏమి చేయాలన్నదానిపైనే దృష్టి ఉంటుంది. ఆ క్రమంలో భారీ డిమాండ్ లతో కేంద్రాన్ని ఇరుకున పెట్టడానికి యత్నిస్తుంటాయి.జాతీయ పార్టీలకు ఆ వెసులుబాటు ఉండదు. అయితే అదే సమయంలో కేంద్రంలో అదికారంలో ఉండే జాతీయ పార్టీ తమకు కావల్సిన రాష్ట్రాలకు అదిక సాయం చేస్తుంటాయి.ఈ క్రమంలోనే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల వాదనలు తెరపైకి వస్తున్నాయి.బిజెపి ఉత్తరాదికి ప్రాదాన్యత ఇస్తూ తమను నిర్లక్ష్యం చేస్తోందని దక్షిణాది ప్రాంతీయ పార్టీలు వ్యాఖ్యానిస్తుంటాయి.ఈ ప్రాసెస్ అంతా ఒక సమతుల్యతతో సాగవలసి ఉంటుంది. లేకుంటే భావోద్వేగాలకు అవకాశం ఏర్పడుతుంది. 1982 లో ఎన్.టి.ఆర్.ఆత్మగౌరవ నినాదంతో టిడిపిని ఏర్పాటు చేసి జాతీయ పార్టీకి సవాల్ విసిరి సఫలం అయ్యారు.తెలంగాణలో కెసిఆర్ తెలంగాణ ఆత్మగౌరవ నినాదం ఎత్తుకుని ప్రత్యేక రాస్ట్రాన్ని సాదించారు. తమిళనాడులో ఎప్పుడూ తమిళ వాదం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి నిరసనగా వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టుకుని ఎపి ముఖ్యమంత్రి అయ్యారు. మమత బెనర్జీ అంతకన్నా ముందే కాంగ్రెస్ తో విబేదించి బయటకు వచ్చారు. శరద్ పవార్ కూడా కాంగ్రెస్ నుంచి వేరుపడి ఎన్.సిపి ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఆయా రాష్ట్రాలలో పరిస్థితులు చూస్తే ప్రాంతీయ పార్టీల మీద భవష్యత్తులో జాతీయ రాజకీయ పార్టీలు ఆధారపడక తప్పని పరిస్థితులు ఉంటాయన్న అబిప్రాయం కలుగుతుంది.అందువల్ల కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా నామకరణం చేసుకున్నా అవి ప్రాంతీయ పార్టీలే.అలాగే కొన్ని జాతీయ పార్టీలు దేశం అంతటా లేకపోవడంతో అవి పెద్ద ప్రాంతీయ పార్టీలుగానే కనిపిస్తున్నాయి.

tags : regional parties

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info