A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
Share |
July 2 2020, 6:27 pm

గుంటూరు టిడిపి మాజీ ఎమ్.పి రాయపాటి సాంబశివరావు మరిన్ని చిక్కులలో పడతారా? ఆయన కు చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ పోలవరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టర్ లకు డబ్బు చెల్లించకపోవడంపై జర్మని రాయబారి కేంద్రానికి పిర్యాదు చేశారని సమాచారం వచ్చింది.దీనితో కేంద్రం తన ఏజెన్సీలను రంగంలోకి దించిందని సమాచారం వచ్చింది. ఇప్పటికే బ్యాంకులు ఆస్తుల వేలానికి నోటీసులు ఇచ్చిన నేపద్యంలో ఈ పరిణామం రాయపాటికి మరింత ఆదోళన కలిగించేది అవుతుంది.పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో సబ్‌ కాంట్రాక్టు కింద డయాఫ్రమ్‌ వాల్‌ పనులు చేసిన బావర్‌.. జెట్‌ గ్రౌటింగ్‌ చేసిన కెల్లర్‌ సంస్థలకు బకాయిపడిన బిల్లులను చెల్లించక పోవడంపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) విచారణకు రంగం సిద్ధం చేసింది. ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లించేలా కేబినెట్‌ తీర్మానం చేసిందని, అయితే దాన్ని తుంగలో తొక్కడం వల్లే తమ దేశానికి చెందిన బావర్, కెల్లర్‌ సంస్థలకు రావాల్సిన బిల్లులు చేరలేదని పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం), డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌)కు జర్మనీ రాయబారి ఫిర్యాదు చేశారు. బావర్‌.. కెల్లర్‌లకు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై డీపీఐఐటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరా తీసింది.
ట్రాన్స్‌ట్రాయ్‌ వద్ద ఆ రెండు సంస్థలు సబ్‌ కాంట్రాక్టు కింద పనులు చేశాయని.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులున్నీ ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించిందని డీపీఐఐటీకి తేల్చి చెప్పింది. బావర్, కెల్లర్‌లకు ట్రాన్స్‌ట్రాయ్‌ బకాయి పడినందున వాటితో తమకు సంబంధం లేదని పీఎంవోకూ నివేదించింది. 2015–19 మధ్య కాలంలో పోలవరం బిల్లుల చెల్లింపు వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసి, నివేదిక ఇవ్వాలని డీఆర్‌ఐని పీఎంవో ఆదేశించింది. డీఆర్‌ఐ రంగంలోకి దిగితే చంద్రబాబు కమీషన్‌ల బాగోతం వెలుగు చూస్తుందని ప్రచారం జరుగుతోంది.

tags : rayapati

Latest News
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info