A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
Share |
April 8 2020, 8:56 pm

చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–16) మార్గంలో రాజమహేంద్రవరం నుంచి విజయనగరంవరకు నిర్మించే మరో జాతీయ రహదారి (516 –ఇ)కి అటవీ అనుమతులు మంజూరయ్యాయి.రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, రంపచోడవరం నుంచి కొయ్యూరు, కొయ్యూరు నుంచి లంబసింగి, లంబసింగి నుంచి పాడేరు, పాడేరు నుంచి అరకు, అరకు నుంచి గౌడార్‌ మీదుగా శృంగవరపు కోట, విజయనగరం వరకు ఆరు ప్యాకేజీలుగా విభజించారు. మొత్తం రూ. 1,500 కోట్ల అంచనాలతో 406 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లు తయారుచేసి కేంద్రానికి సమర్పించింది. ఇందులో మొదటగా మూడు ప్యాకేజీల కింద 137 కిలోమీటర్లకు గాను రూ. 457 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. పర్యాటకంగా, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధితో పాటు మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించేందుకు కేంద్రం ఈ జాతీయ రహదారి చేపట్టినట్లు ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు పేర్కొంటున్నాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఈ రహదారికి ప్రాధాన్యత ఏర్పడనుంది. భద్రాచలంకు ఈ ఏజెన్సీ ప్రాంతాలు దగ్గరగా ఉండటంతో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వారికి ఈ జాతీయ రహదారి వెసులుబాటుగా ఉంటుంది.

tags : vijayanagaram

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info