A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
Share |
July 2 2020, 6:50 pm

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పై వచ్చిన సిబిఐ ఫిర్యాదు చూస్తే సంచలనంగా ఉంది. ఇంతకాలం ఎపి ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా రాజదానిలో రియల్ ఎస్టేట్ దందా సాగిందన్న దానికి బలం చేకూర్చేలా ఉంది. యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్‌ సుజనా చౌదరి, ఆయన సోదరుడు జతిన్‌కుమార్‌ ‘సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’ విస్తరణకు తీసుకున్న రూ.322.03 కోట్ల రుణాన్ని దారి మళ్లించి సీఆర్‌డీఏ పరిధిలో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్‌కు వినియోగించారని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసిందన్న వార్త వచ్చింది. రుణాన్ని తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకుండా మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. వడ్డీతో కలిపి రుణం రూ.400.84 కోట్లకు చేరుకుందని, దీన్ని రికవరీ చేసేందుకు తనఖా ఆస్తులను మార్చి 23న ఈ–ఆక్షన్‌ విధానంలో వేలం వేస్తున్నామని తెలిపింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణాన్ని దారి మళ్లించిన సుజనా చౌదరి, జతిన్‌కుమార్‌ తదితరులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా రెండు నెలల క్రితం ఇదే తరహాలో సుజానా చౌదరిపై ఫిర్యాదు చేసింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజ్జెక్ట్‌ లిమిటెడ్‌ పేరుతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రూ.304 కోట్ల రుణం తీసుకుని మోసగించినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేసిన ఫిర్యాదుపై సీబీఐ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేందుకు సీబీఐ సిద్ధమైంది.


ఆధారాలతో సీబీఐకి బ్యాంకు ఫిర్యాదు..
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసి అగ్రిమెంట్‌ చేసుకున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద తీసుకున్న రుణాన్ని మళ్లించి 2018 నవంబర్‌ 13న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో 623.12 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి కూడా ఈ నిధులను మళ్లించినట్లు గుర్తించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధారాలతో సీబీఐకి ఫిర్యాదు చేసింది.

tags : sujana chowdary

Latest News
*కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*చంద్రబాబుకే మతిమరుపు..ప్రజలకు కాదు
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info