A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడుకు హెచ్చరించిన హోం మంత్రి
Share |
April 5 2020, 9:01 am

ఈనాడు పత్రికను తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసులు ,దొంగలు దోస్తి అంటూ ఆ పత్రిక రాసిన కదనంపై ఆయన మండిపడ్డారు. పత్రికా సంపాదకుడు క్షమాపణ చెప్పాలని ,లేదా వెయ్యి కోట్ల దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు నంబర్‌వన్‌గా నిలిచారని, నేరం జరిగిన వెంటనే నిందితులను అరెస్ట్‌ చేస్తున్నారని చెప్పారు. ఈనాడు కథనంలో వాస్తవాలు లేవని అన్నారు. రాజకీయ నాయకులు చెప్తే పోలీస్ పోస్టింగ్‌లు వస్తున్నాయనేది అవాస్తవమని, బదీలీల వ్యవహారాన్ని గమనించడానికి ఓ ప్రత్యేక విభాగం ఉందని వెల్లడించారు. ఏ అధికారి ఎలా పని చేస్తున్నారనే దానిపై నిఘా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ భద్రత పరంగా బాగుండడానికి పోలీసుల పనితీరే కారణమని, ఆధారాలు లేకుండా కథనాలు రాయడం బాధాకరమన్నారు. ఏ ఆధారాలతో కథనాలు రాశారో ఈనాడు ఎడిటర్ సమాధానం చెప్పాలని అన్నారు. అవాస్తవ కథనం ప్రచురించిన ఈనాడు సంపాదకులు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ప్రభుత్వం తరపున వెయ్యి కోట్ల దావా వేస్తామని అలీ పేర్కొన్నారు.

tags : eenadu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info