A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
Share |
July 2 2020, 5:07 pm

పార్లమెంట్‌లో లౌకికవాదం అనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బయట మాత్రం మతం పేరిట దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్‌ రావు విమర్శించారు. ఎంఐఎం మత విద్యేషాలు రెచ్చగొట్టే పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను ఆధారం చేసుకుని ఎంఐఎం దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుందని విమర్శించారు. అదే విధంగా ఎంఐఎంకు తోడు పార్టీలుగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మారాయన్నారు. భారతదేశం నడి బొడ్డున ఎంఐఎం మీటింగ్‌లో ఒక అమ్మాయి పాకిస్థాన్‌ జిందాబాద్‌ అని నినాదాలు చేసిందని, గతంలో ఎంఐఎం సీనియర్‌ నేత వారీస్‌ పఠాన్‌ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, సెక్యులర్‌ అని చెప్పుకునే కాంగ్రెస్‌, వామపక్షాలు ఇతర పార్టీలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఎంఐఎం హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందువులను ఇన్ని మాటలు అంటుంటే రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు ఎక్కడకు వెళ్లారని ధ్వజమెత్తారు. భారతదేశ ముస్లీంలు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలను.. ఎంఐఎం పార్టీ వ్యాఖ్యాలను ఖండించాలని పిలుపునిచ్చారు. సీఏఏ వ్యతిరేక ఊరేగింపులకు భారదేశ జెండా పట్టుకుని తిరగడం ఒక డ్రామా వాళ్ల అసలు ఎజెండా పాకిస్థాన్‌ జెండా అంటూ కృష్ణ సాగర్‌ వ్యాఖ్యానించారు.

tags : krishna sagar

Latest News
*క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
* ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
*అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
*తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
*దుండగుల కాల్పులు-24 మంది మృతి
*ఎపిలో కొత్త అంబులెన్స్ లపై ఆసక్తికర కదనం
*ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
* రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
*ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
*ఎపి అంబులెన్స్ లు- ఐఎమ్ ఎ హర్షం
*మంత్రివర్గ విస్తరణకు రెడీ
*ఎస్టి రిజర్వేషన్లు ఏమయ్యాయి కెసిఆర్ గారూ..
*తెలంగాణలో గండ్లు పడే ప్రాజెక్టులు, కాల్వలా!
*అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
*రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
*జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
*ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
*మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
*రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
*ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ను
*అడవులతోనే పకృతి సమతుల్యత
*‘మేము మీతో ఉన్నాం’ డాక్టర్లకు గవర్నర్ భరోసా
*గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
*టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
*ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
*ఆన్ లైన్ క్లాస్ లు ఉంటాయా?ఉండవా?హైకోర్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info