A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రెండేళ్లు కొత్త ఇంజినీరింగ్ కాలేజీలు ఇవ్వరు
Share |
February 23 2020, 9:24 am

రెండేళ్లపాటు కొత్తగా ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి అనుమతించరు. ఈ మేరకు అఖిలభారత సాంకేతిక విద్య మండలి నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలలలో సగం సీట్లే భర్తీ అవుతున్నాయి. డిప్లమా? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, పిజి కోర్సులలో దేశంలో ఇరవై ఏడు లక్షల సీట్లు ఉన్నాయి. డిప్లమా లో పదకుండు లక్షల సీట్లు, అండర్ గ్రాడ్యుయేషన్ లో 14 లక్షల సీట్లు, పిజి సీట్లు 1.8 లక్షల సీట్లు ఉన్నాయి. కాని మొత్తం అన్ని కలిపి 13 లక్షల సీట్లు మాత్రమే బర్తీ అవుతున్నాయి. తమిళనాడులో 2.9లక్షల సీట్లు ఉంటే, ఒకటిన్నర లక్షల సీట్లు, ఆంద్ర లో 1.6లక్షల సీట్లు ఉంటే, 67715సీట్లు, ఉత్తరప్రదేశ్ లో 1.1 లక్షల సీట్లు ఉంటే, 57159సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ నేపద్యంలోఎఐసిటిఈ రెండేళ్ల పాటు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరు చేయరాదని నిర్ణయం తీసుకుంది.

tags : aicte

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info