A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకేసు తీగే లాగారు..-ఇంకా డొంక చాలా ఉంది
Share |
August 4 2020, 4:43 pm

కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటన తర్వాత రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం దొంగలు తేలుకుట్టినట్టు నోరుపెగలకుండా ఇంట్లోనే కూర్చున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.ఈ విషయమై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఉండవల్లి శ్రీదేవి, రాజన్న దొర, హఫీజ్‌ ఖాన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


ఇన్‌ఫ్రా కంపెనీల ద్వారా సబ్‌కాంట్రాక్టులు ఇచ్చినట్టుగా చూపించి అసలు లేని మాయా కంపెనీలు, బోగస్‌ కంపెనీలు సృష్టించి మరీ ఈ వేల కోట్లను తరలించారని బయటపెట్టారు. ప్రాథమికంగానే రూ.2వేల కోట్లకుగా పైగా లెక్కాపత్రంలేని డబ్బు లావాదేవీలు జరిపనట్టు విచారణలో తేలిందని బయటపెట్టారు. వారిచ్చిన రిజిస్టర్డ్‌ అడ్రస్‌ల్లో కూడా తీవ్రమైన అవకతవకలు ఉన్నాయని, ఇవి షెల్‌ కంపెనీలని, అంటే అందరికీ అర్థమ్యే భాషలో డొల్ల కంపెనీలని, బ్రీఫ్‌ కేస్‌ కంపెనీలని ఆ ప్రకటనల్లో స్పష్టంగా రాశారు. వీరి ఐటీఆర్‌ ఫైల్సింగ్‌ కూడా ప్రధాన కంపెనీలోని ఒక ఐపీ అడ్రస్‌నుంచి జరిగాయని చెప్పారు. బోగస్‌ బిల్లింగులు, అవకతవకలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్న బోగస్‌ డాక్యుమెంట్లు ఇతర పత్రాలు, తమ సోదాల్లో దొరికాయని, ఇంతటితో ఆగిపోకుండా విదేశాలతో వీరు నిర్వహించిన లావాదేవీలకు సంబంధించిన లెక్కాపత్రం లేని డబ్బును తాము కనుగొన్నామని అందులో స్పష్టంచేశారు. వీటిని ఎఫ్‌డీఐల రూపంలో ప్రత్యేకించి కొన్ని గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు రూటింగ్‌ చేశారని వారి మాటల్లోనే చెప్పాలంటే రౌండ్‌ ట్రిప్పింగ్‌ చేశారని రాశారు.
ఇంత స్పష్టంగా వివరాలు బయటపెడితే... చంద్రబాబు మాట్లాడడు, లోకేష్‌మాట్లాడడు. పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడడు, వీరిని సమర్థించే ఎల్లోగ్యాంగ్‌ సభ్యులెవ్వరూ కూడా మాట్లాడరు. అంటే.. ఈ రైడ్స్‌ అనేవి కేవలం ఒక పర్వతంలో ఒక వెంట్రుకంత మాత్రమే. చంద్రబాబు పర్సనల్‌ సెక్రటరీ, లోకేష్‌ అనుచరుడ్ని పట్టుకుని విచారిస్తేనే ఇంత భారీగా దొరికిందంటే.. ఇక చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఎంతగా ఉందో.. మొత్తం దేశానికి అర్థం అవుతోంది. చంద్రబాబుపై పూర్తిస్థాయి దర్యాప్తును సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ, ఆర్వోసీ, ఐటీ, విదేశాంగ మంత్రిత్వశాఖ, రక్షణశాఖ మాత్రమే కాకుండా విదేశాల్లోని రాయబార కార్యాలయాలు కూడా సంపూర్ణంగా సహకరించి విచారించాల్సిన సమయం ఆసన్నమైంది.

ఇప్పుడు లాగింది కేవలం తీగ మాత్రమే. కదలాల్సిన డొంక చాలా పెద్దదే ఉంది.ఈవిషయాన్ని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తోంది. ఆధారాలను ఎప్పటికప్పుడు ప్రజలముందు బయటపెట్టింది. ఇప్పుడిక చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేష్‌పై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించి ముందుగా ఆయన వ్యవస్థలను మేనేజ్‌ చేయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భయంతోనే బీజేపీలో తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తన రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపాడని, పవన్‌కళ్యాణ్‌ను తనకు రక్షణగా వాడుకుంటున్నాడని అర్థమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు పార్టనర్‌లకు, చంద్రబాబులకు మధ్య గత ఐదేళ్లుగా తెరవెనుక జరిగిన లావాదేవీల మధ్య దృష్టిపెట్టాల్సి ఉంది అని ఆ ప్రకటనలో వారు తెలిపారు.

tags : ysr congress, chandrababu

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info