A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శ్రీనివాస్ డైరీ లో స్కామ్ వివరాలు ఉన్నాయా
Share |
February 23 2020, 8:59 am

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు పిఎస్ గా గతంలో పనిచేసిన పి.శ్రీనివాస్ వద్ద డైరీ దొరికిందని, అందులో అనేక కీలక అంశాలు ఉన్నాయని ఒక మీడియాలో కదనం వచ్చింది. అది నిజమే అయితే సంచలనమే అవుతుంది. శ్రీనివాస్‌ నివాసాల్లో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో 2014, 2015, 2016, 2017, 2018, 2019 సంవత్సరాలకు సంబంధించిన డైరీలను స్వాధీనం చేసుకుంది. చంద్రబాబుకు ఏయే కాంట్రాక్టు సంస్థల నుంచి ఏ తేదీన ఎంత మొత్తంలో ఏయే సబ్‌ కాంట్రాక్టర్ల పేర్లతో కమీషన్‌ల రూపంలో వసూలు చేసిందీ.. వాటిని ఏయే సంస్థలకు మళ్లించిందీ.. నల్లధనాన్ని ఎలా విదేశాలకు మళ్లించిందీ.. చంద్రబాబు కుటుంబ సంస్థలకు నగదు రూపంలో వచ్చిన వివరాలు.. చంద్రబాబు, లోకేష్‌లకు నగదు రూపంలో ఇచ్చిన వివరాలు ఆ డైరీల్లో శ్రీనివాస్‌ స్పష్టంగా పేర్కొన్నారు. వాటి ఆధారంగా ఐటీ శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో రూ.రెండు వేల కోట్ల నల్లధనం కుంభకోణం బయటపడింది..అని ఆ కదనం వివరించింది.

tags : it, raids

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info