A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒక్క చుక్క నీరు కూడా వృదా పోకుండా చూడాలి
Share |
August 5 2020, 1:24 pm

గోదావరి నీళ్లు చుక్క కూడా వృథా పోకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదేనని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఎంతో కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నామని ఆయన అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ప్రాణహిత గోదారి గంగ పవిత్ర జలాలను తలపై చల్లుకుని నాణేలు వదిలి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత గోదావరి ఘాట్‌ నుంచి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం చేరుకుని పూజలు చేశారు.
రాబోయే వర్షాకాలం వరద నీరు ఉధృతంగా చేరుతుందని, ఈ నేపథ్యంలో లక్ష్మీ బ్యారేజ్‌ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే సహా పలువురు ఇంజనీర్లు, ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. ‘ప్రాజెక్టుల నిర్మాణం, నీటి సరఫరా విషయంలో ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని పూర్తిస్థాయిలో ఇంజనీరింగ్‌ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలి. అవసరమైతే పోలీసుల మాదిరి వైర్‌లెస్, వాకీటాకీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని పని చేయాలి. సమాచారాన్ని ప్రతి క్షణం చేరవేసుకుంటూ ఎప్పుడు ఏ మోటార్‌ నడుస్తోంది.. ఏ పంపు పోస్తోంది.. ఎంత నీరు ఎత్తిపోయాలి.. ఎప్పుడు ఆపాలే.. ఎప్పుడు నీటిని కిందికి వదలాలే వంటి పలు విధాలైన నీటి పంపిణీ సాంకేతిక అంశాలపై కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలి’అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

tags : kcr

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info