A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రాంతీయ పార్టీలే శాసిస్తాయి
Share |
February 23 2020, 9:08 am

ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారనేందుకు ఢిల్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలంగాణ మంత్రి , టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ అన్నారు. ఇకముందు ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాలను శాసిస్తాయని ఆయన అబిప్రాయపడ్డారు. అందుకు ఇది ఆరంభమని అన్నారు. ‘‘రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయి. కేంద్రం రాష్ట్రాలతో సఖ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కేంద్రం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ వంటి ఎన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టినా.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనన్న వాస్తవం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఏ ప్రాజెక్టుకైనా రాష్ట్ర ప్రభుత్వాలే భూమి, విద్యుత్తు, నీరు వంటి సౌకర్యాలు, ప్రోత్సాహకాలు ఇస్తాయని గుర్తుచేశారు. కేంద్రం ఈ వాస్తవాన్ని గ్రహంచి ఉదారంగా వ్యవహరించాలని కోరారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info