A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు ఒకే పరీక్ష
Share |
February 23 2020, 9:53 am

కేంద్రంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించాలన్న ఆలోచనను కేంద్రం చేస్తోంది. ఒక పరీక్షలో తెచ్చుకున్న మార్కుల ఆదారంగా మూడేళ్లలోపు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపై ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా నాన్‌ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అధ్వర్యంలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక పరీక్షలు రాయాల్సి వచ్చేదని, తాజా నిర్ణయం వల్ల నిరుద్యోగులకు సమయం, డబ్బులు ఆదా అవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

tags : center, jobs

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info