A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చెన్నమనేని జర్మనీ పాస్ పోర్టుతో తిరిగారా
Share |
February 25 2020, 10:59 am

వేముల వాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ తాను భారతదేశ పౌరున్ని అంటూనే జర్మనీ పాస్‌పోర్టుపై జర్మనీ ఎలా ప్రయాణం చేస్తున్నాడని ఆయనపై పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు. జర్మనీ పాస్‌పోర్టుపై మద్రాస్‌ నుంచి జర్మనీ వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందని, దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్పిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్ర హోంశాఖ మూడు సార్లు చెన్నమనేని రమేశ్‌ భారతదేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా గత 11 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలను, దేశాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తు భారతదేశ న్యాయస్థానం ఈ దేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా దొంగ చాటుగా పౌరసత్వం పొంది వివాదంలో కూరుకుపోయిన వ్యక్తికి టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఎలా ఇచ్చిందని ఆయన అన్నారు.

tags : chennamneni

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info