A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పేదలపై ఈ ఏడాది విద్యుత్ చార్జీల భారం లేదు
Share |
August 4 2020, 4:50 pm

పేదలు, అల్పాదాయ వర్గాల కరెంట్‌ బిల్లులు ఈ ఏడాది పైసా కూడా పెరిగే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు. ప్రజలపై పడే రూ.10,060.63 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రూ.1,707.07 కోట్లను గృహ విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదారులున్నారు. ఇందులో నెలకు 50 యూనిట్ల విద్యుత్‌ వాడకం ఉన్నవారు 50.90 లక్షల మంది. వీరికి గతంలోనూ, ఇప్పుడూ వచ్చే కరెంట్‌ బిల్లు (యూనిట్‌ రూ.1.45 చొప్పున) నెలకు రూ.72.50. ఇక నెలకు 51–75 యూనిట్ల విద్యుత్‌ వాడే వారి సంఖ్య 22.47 లక్షలు. వీరికి గతంలో రూ. 137.50 బిల్లు వచ్చేది.. ఇప్పుడూ అంతే. (50 యూనిట్ల వరకూ యూనిట్‌ రూ.1.45.. మిగిలిన 25 యూనిట్లకు యూనిట్‌ రూ.2.60 చొప్పున). అంటే.. దాదాపు 74 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులకు ఒక్కపైసా కూడా కరెంట్‌ బిల్లు పెరిగే ప్రసక్తే లేదని ఒక మీడియాకు ఆయన చెప్పారు.

tags : ap,power charges

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info