A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వాళ్లేమన్నా కార్పెట్లు క్లీన్ చేస్తున్నారా-కన్నబాబు ప్రశ్న
Share |
February 23 2020, 9:26 am

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి జగన్ ల మద్య జరిగిన సమావేశంపై టిడిపి దుష్ప్రచారం చేస్తోందని వ్యవసాయ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. టిడిపి నేతలతో పాటు టిడిపి మీడియా కూడా పిచ్చి రాతలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. వీరు ప్రదాని గదిలో కార్పెట్లు క్లీన్ చేస్తున్నారా?లేక టీ సర్వ్ చేస్తున్నారా ?అని ఆయన మండిపడ్డారు . మోడీ, జగన్ ల మద్య జరిగిన సమావేశాన్ని వక్రీకరించి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మద్య సత్సంబందాలు ఉండడం ఇష్టం లేక వీరు ఇలాంటి పిచ్చి మాటలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అదికారం లేకపోవడంతో ఒక్క రోజు కూడా భరించలేకపోతున్నారని అన్నారు. మండలి రద్దు తీర్మానంతో యనమల,లోకేష్ ల మైండ్ బ్లాక్ అయిందని ఆయన అన్నారు.

tags : kannababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info