A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రం నుంచి జగన్ ఒక సైసా తీసుకు రాలేదు
Share |
February 25 2020, 10:45 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నిసార్లు డిల్లీ వెళ్లినా కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా అదనంగా తీసుకు రాలేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్ ఎందుకోసం డిల్లీ వెళుతున్నారు? ఆయన కేసుల కోసం వెళుతున్నారా అని యనమల ప్రశ్నించారు. ఎపిలో పరిణామాల వల్ల దేశ ఆర్దిక ప్రయోజనాలకు నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి మెండిచెయ్యి చూపారని ఆయన అన్నారు.బడ్జెట్ లో కేటాయింపులు ఉంటేనే నిధులు విడుదల చేసే అధికారం ఉంటుందన్నారు.జగన్ ఏడు సార్లు దిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు.. ఆ వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని యనమల ప్రశ్నించారు.

tags : yanamala, center

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info