A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జయము,జయము చంద్రన్న భజన పరాకాష్ట
Share |
February 23 2020, 9:36 am

ప్రతిపక్ష నేత చంద్రబాబుపైన, ఆంద్రజ్యోతి రాదాకృస్ణపైన వైఎస్ ఆర్ ఆకంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సందించారు. ట్విటర్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.

ఏ రాష్ట్రంలో సిఎం ప్రమాణ స్వీకారం ఉన్నా నమ్మకస్థులను పంపి ఇన్విటేషన్ సంపాదించేవాడు. ఎన్డీయేలో లేకున్నా ఇప్పుడు కేజ్రీవాల్ పదవీ ప్రమాణానికి వెళ్లే దమ్ము లేదు. బిజెపి పెద్దల కంట్లో పడితే పాత కేసులు ఎక్కడ తిరగతోడతారో అని వణుకుతున్నాడు. అప్పట్లో గిరగిరా తిప్పిన చక్రాలు ఏమయ్యాయో?

బాబు సిఎంగా లేని ఆంధ్ర రాష్ట్రం నాశనమై పోవాలని కోరుకుంటున్నాడు కిరసనాయిలు. సిఎం జగన్ గారు రాష్ట్ర సమస్యల గురించి గంటన్నర సేపు ప్రధాని మోదీ గారితో సమావేశమైతే పిపిఏలపై మందలించాడని సైనైడ్ వార్తలు కుమ్మరించాడు. జయము జయము చంద్రన్న భజన పరాకాష్ఠకు చేరింది.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info