A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సీమలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలి-జనసేన
Share |
August 4 2020, 5:13 pm

• రాయలసీమ నాయకులు, పి.ఏ.సి. సభ్యులతో సమావేశంపై జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటన ఇది.
.................................
రాయలసీమ జిల్లాల్లో ప్రతి ఎకరాకు నీరు అందించడంతోపాటు తాగు నీటి ఎద్దడి
నివారణకు చేపట్టాల్సిన చర్యలేమిటి... పాలకులు చేస్తున్నదేమిటి అనే విషయాలపై
జనసేన సమగ్రంగా అధ్యయనం చేస్తుందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్
గారు స్పష్టం చేశారు. రాయలసీమలోని జల వనరులు, ఇక్కడి సాగు నీటి ప్రాజెక్టులపై
జిల్లాలవారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. బుధవారం
రాత్రి కర్నూలులో రాయలసీమ నాయకులు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ
సభ్యులతో సీమ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించారు. రాయలసీమ కోసం ఎన్నో
ప్రాజెక్టులను చేపట్టినా ప్రయోజనం ఉండటం లేదనీ... ఉన్న ప్రాజెక్టులను
సక్రమంగా నిర్వహించడం లేదని... నిర్మాణ దశలో ఉన్నవి ఎప్పుడు పూర్తవుతాయో
తెలియని పరిస్థితి ఉందని నాయకులు పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకు వచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “వర్షాలు బాగా కురిసినా
చెరువులు నింపలేకపోయారు. ప్రాజెక్టుల నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేకపోవడం
వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వలసలు ఆగడం లేదు. సాగుబడికి ఎన్నో
అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి జల వనరులు, ప్రాజెక్టులపై జిల్లాలవారీగా సమావేశాలు
నిర్వహిద్దాం. ఈ సమావేశాల్లో జల వనరుల నిపుణులు, రైతు ప్రతినిధులు, ఇక్కడి రైతుల
కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలు, రాయలసీమ అభివృద్ధిని కోరుకొంటూ పని చేసేవారిని
భాగస్వాములను చేద్దాం. ఈ జిల్లాల్లో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడం, ప్రతి ఇంటికీ తాగు
నీటిని అందించడం అవసరం. సీమ సౌభాగ్యమే లక్ష్యంగా జనసేన పని చేస్తుంది”
అన్నారు. రాయలసీమలో జల వనరుల నిర్వహణ, ప్రాజెక్టుల పని తీరు,
వ్యవసాయాభివృద్ధి, రైతులకు లబ్ధి చేకూర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై
ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలని నాయకులను
ఆదేశించారు. ఈ సమావేశంలో పి.ఏ.సి. సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి,
డా.హరిప్రసాద్, శ్రీ సి.మనుక్రాంత్ రెడ్డి, పార్టీ నాయకులు శ్రీ చింతా సురేశ్
బాబు, శ్రీమతి రేఖా గౌడ్, శ్రీ వెంకప్ప, డా.బాల వెంకట్, శ్రీ అర్షద్ షేక్, శ్రీ
పవన్, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ పాల్గొన్నారు.

tags : janasena

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info