A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ భవనాలను కూల్చకండి- హైకోర్టు
Share |
February 23 2020, 10:21 am

తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు భవనాలను కూల్చరాదని తెలిపింది. గతంలో మౌఖికంగా ఈ ఆదేశాలు ఉండగా.. ఇప్పుడు రాతపూర్వకంగా వాటిని వెలువరించింది. సచివాలయ భవనాలను కూల్చొద్దంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కేఎల్‌ విశ్వేశ్వర్‌రావు తదితరులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. కొత్తగా నిర్మాణాలు చేసేందుకు ప్రభుత్వం ఇంకా ప్లాన్‌లు రూపొందించలేదని, ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కొత్తగా రూపొందించే ప్లాన్‌లను మంత్రివర్గ సమావేశం ఆమోదించే వరకూ ప్రస్తుత సచివాలయ భవనాల్ని కూల్చవద్దని, తామిచ్చే తుది ఉత్తర్వుల వరకూ వాటిని అలాగే ఉంచాలని పేర్కొంది.

tags : highcourt

Latest News
*ట్రంప్ బాహుబలి- వీడియో వైరల్
*మోకాలికి, బోడిగుండుకు ఈనాడు లింక్ పెట్టిందా
*తెలంగాణలో 45 వేల ఎకరాల్లో పామాయల్ సాగు
*ట్రంప్ కుమార్తె ప్రొగ్రాం కు సి.ఎమ్.ను పిలవాలా
*సిట్ - నా సేవలన్ని కూడా వాడుకోండి-బిజెపి నేత
*కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం చేస్తోంది
*రైతు రుణమాపీల వల్ల లాభం ఉండదు-వెంకయ్య
*ఎపిలో ఎన్ని వార్తల్ని ఖండించాలో
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info