A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్.. ముందుగా రేణుదేశాయ్ గురించి మాట్లాడు
Share |
August 14 2020, 10:43 am

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కర్నూలు వైసిపి ఎమ్మెల్యే హపీజ్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు. . కర్నూలులో 2017లో బాలికపై జరిగిన హత్యాచారం జరిగితే ఇప్పుడు న్యాయం చేయాలని పవన్‌ అడుగుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనపై న్యాయం చేయాలని ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ అడగడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. పవన్ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని అన్నారు. అసలు ముందుగా పవన్ కళ్యాణ్ వల్ల రేణూదేశాయ్ ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు.ముందుగా ఆ విషయంపై పవన్ వివరణ ఇచ్చి ఉండాల్సిందని ఆయన అన్నారు. చంద్రబాబు సూచన మేరకే ఆయన ఇప్పుడు కర్నూలు వచ్చారా? ఎఫ్‌ఐఆర్‌, ఛార్జ్‌షీట్‌ వేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. జరిగిన సంఘటనపై మరలా విచారణ జరిపించాలని బాలిక తల్లిదండ్రులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు మళ్లీ విచారణ జరిపిస్తున్నాం. విచారణ కోసం ఒక మహిళా అధికారిని ప్రభుత్వం నియమించింది. కర్నూలులో జరిగిన సంఘటనపై చంద్రబాబు పవన్‌ నిలదీయాలి. హత్యాచారానికి గురైన బాలిక పేరు ప్రస్తావించకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా పవన్‌ కల్యాణ్‌కు లేదు. ఇప్పటికే బాధిత బాలిక కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశ్యంతో డీజీపీని కలిశాం. పవన్‌ రోడ్డు మీదకు రాకముందే సీబీఐ విచారణకు పరిశీలించాలని డీజీపీని కోరాం. పవన్‌ కల్యాణ్‌ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

tags : hafij khan

Latest News
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info